ఇంటర్మీడియట్ పూర్తి చేసిన తర్వాత విద్యార్ధులు తమ కెరీర్ లో ఉన్నత చదువుల కోసం ఏ కోర్సును ఎంపిక చేసుకోవాలో తెలియక తర్జనభర్జన పడుతుంటారు. అటువంటి వారికోసం CBSE (Central Board of Secondary Education) చే గుర్తించబడిన 113 రకాల కోర్సులలో ఒక్కొక్క కోర్సు గురించి వివరించడం జరిగింది. దీని ద్వారా విద్యార్ధులు ఏ రంగంలో ఎటువంటి కోర్సులు ఉన్నాయో తెలుసుకొని, తమకు నచ్చిన రంగంలో కోర్సును ఎంపిక చేసుకొని జీవితంలో ఉన్నత స్థాయిలో స్థిరపడవచ్చు. అందులో బాగంగా CBSE చే గుర్తించబడిన 113 రకాల కోర్సులలో కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్ (Computer Science Engineering) కోర్సు గురించి వివరణ.
కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్ (Computer Science Engineering)
పరిచయం(Introduction):
కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్ లో కంప్యూటర్ సైన్స్ మరియు ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్ రెండు ఉంటాయి. ఇది కంప్యూటర్ భాగాలను పరీక్షించడం మరియు రూపకల్పన చేయడం వంటివి కలిగి ఉంటుంది. కంప్యూటర్ ఇంజనీర్లు రెండు రకాలు. కంప్యూటర్ సాఫ్ట్వేర్ ఇంజనీర్లు మరియు కంప్యూటర్ హార్డ్ వేర్ ఇంజనీర్లు.
కోర్సుల వివరాలు:
- B.Tech., కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ (B.Tech., Computer Science and Engineering)
- B.Tech., కంప్యూటర్ సైన్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ (B.Tech., Computer Science and Information Technology)
- B.Tech., కంప్యూటర్ సాఫ్ట్ వేర్ ఇంజనీరింగ్ (B.Tech., Computer Software Engineering)
- కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ (Computer Science and Engineering)
అర్హతలు(Eligibility):
బయాలజీ, కెమిస్ట్రీ మరియు మ్యాథమెటిక్స్ లో 10+2 లో ఉత్తీర్ణత. (IIT కొరకు జాయింట్ ఎంట్రన్స్ ఎక్సామ్ (JEE) తప్పనిసరిగా క్వాలిఫై అవ్వాల్సి ఉంటుంది. ఈ కోర్సు యొక్క డ్యూరేషన్ 4 సంవత్సరాలు ఉంటుంది.)
సంస్థలు/విశ్వవిద్యాలయాలు(Institutes/Universities):
ఇక్కడ భారతదేశంలో ఉన్న కొన్ని ముఖ్యమైన సంస్థలు(Institutes), విశ్వవిద్యాలయాలు(Universities) ల గురించి CBSE Manual లో తెలిపిన ప్రకారం వివరించడం జరిగింది. వివిధ రాష్ట్రాలలో ఉన్న విద్యాసంస్థలు, యూనివర్సిటీలలో కూడా పైన తెల్పిన కోర్సులు అందుబాటులో ఉండవచ్చు. విద్యార్ధులు తమ దగ్గరలో, అందుబాటులో ఉన్న విద్యాసంస్థలు, యూనివర్సిటీలలో మీరు ఎంపిక చేసుకున్న కోర్సులు ఉన్నాయో, లేవో తెలుసుకొని అడ్మిషన్ పొందగలరు.
- ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (IIT), ఖరగ్ పూర్.
- ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (IIT), కాన్పూర్.
- రాజస్థాన్ టెక్నికల్ యూనివర్సిటీ, కోట, రాజస్థాన్.
- ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (IIT), మద్రాస్.