Aeronautical Engineering Course Details in Telugu

Share this Article with Ur Frnds..

ఇంటర్మీడియట్ పూర్తి చేసిన తర్వాత విద్యార్ధులు తమ కెరీర్ లో ఉన్నత చదువుల కోసం ఏ కోర్సును ఎంపిక చేసుకోవాలో తెలియక తర్జనభర్జన పడుతుంటారు. అటువంటి వారికోసం CBSE (Central Board of Secondary Education) చే గుర్తించబడిన 113 రకాల కోర్సులలో ఒక్కొక్క కోర్సు గురించి వివరించడం జరిగింది. దీని ద్వారా విద్యార్ధులు  ఏ రంగంలో ఎటువంటి కోర్సులు ఉన్నాయో తెలుసుకొని, తమకు నచ్చిన రంగంలో కోర్సును ఎంపిక చేసుకొని జీవితంలో ఉన్నత స్థాయిలో స్థిరపడవచ్చు. అందులో బాగంగా CBSE చే గుర్తించబడిన 113 రకాల కోర్సులలో ఏరోనాటికల్ ఇంజనీరింగ్ (Aeronautical Engineering) కోర్సు గురించి వివరణ.

ఏరోనాటికల్ ఇంజనీరింగ్ (Aeronautical Engineering)

Introduction(పరిచయం):

ఏరోనాటికల్ ఇంజనీరింగ్ లో ఒక కోర్సులో ఎయిర్ క్రాఫ్ట్ ల రూపకల్పన , తయారీ, వాణిజ్య విమానయానం మరియు రక్షణ రంగాలలో మెయింటెనెన్స్ కి సంబంధించి టెస్టింగ్ ఉంటుంది. మరియు అడ్వాన్స్డ్ లెవెల్లో ఫిజిక్స్ మరియు మ్యాథమెటిక్స్ లో అధ్యయనం(Involve) ఉంటుంది.

Read Also..  ITI Course Details in India – Eligibility, Trades & Career Guide
కోర్సుల వివరాలు:
  1. B.Tech ఇన్ ఏరోనాటికల్ ఇంజనీరింగ్ (B.Tech in Aeronautical Engineering)
  2. B.E ఇన్ ఏరోనాటికల్ ఇంజనీరింగ్ (B.E in Aeronautical Engineering)
  3. M.Tech ఇన్ ఏరోనాటికల్ ఇంజనీరింగ్ (M.Tech in Aeronautical Engineering)
  4. M.Tech ఇన్ ఏవియానిక్స్ (M.Tech in Avionics)
  5. M.E ఇన్ ఏరోనాటికల్ ఇంజనీరింగ్ (M.E in Aeronautical Engineering)
  6. M.E ఇన్ ఏవియానిక్స్ (M.E in Avionics)
అర్హతలు(Eligibility):

అండర్ గ్రాడ్యూయేట్ లెవెల్:

ఫిజిక్స్, మ్యాథమెటిక్స్ మరియు కెమిస్ట్రీ లో 10+2 ఎక్సామినేషన్ లో ఉత్తీర్ణత.

పోస్ట్ గ్రాడ్యూయేట్ లెవెల్:

ఏరోనాటికల్/ ఏరోస్పేస్ A లేదా సంబంధిత ఇంజనీరింగ్ లో అండర్ గ్రాడ్యూయేట్ డిగ్రీ, లేదా AMAeSI (AeSI-Aeronautical Society of India) యొక్క రెండు సెక్షన్లు A మరియు B లో ఉత్తీర్ణత సాధించి ఉండాలి.

డాక్టరల్ లెవెల్: 

తప్పనిసరిగా ఏరోనాటికల్/ఏరోస్పేస్ ఇంజనీరింగ్ లో పోస్ట్ గ్రాడ్యుయేషన్ పూర్తి చేసి ఉండాలి. మరియు తప్పనిసరిగా వాలిడ్ అయిన GATE స్కోర్ ను కలిగి ఉండాలి.

Read Also..  Mechanical Engineering Course Details | Complete Guide
సంస్థలు/విశ్వవిద్యాలయాలు(Institutes/Universities):

ఇక్కడ భారతదేశంలో ఉన్న కొన్ని ముఖ్యమైన సంస్థలు(Institutes), విశ్వవిద్యాలయాలు(Universities) ల గురించి CBSE Manual లో తెలిపిన ప్రకారం వివరించడం జరిగింది. వివిధ రాష్ట్రాలలో ఉన్న విద్యాసంస్థలు,యూనివర్సిటీలలో కూడా పైన తెల్పిన కోర్సులు అందుబాటులో ఉండవచ్చు. విద్యార్ధులు తమ దగ్గరలో, అందుబాటులో ఉన్న  విద్యాసంస్థలు, యూనివర్సిటీలలో మీరు ఎంపిక చేసుకున్న కోర్సులు ఉన్నాయో, లేవో తెలుసుకొని అడ్మిషన్ పొందగలరు.

  1. ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఏరోనాటికల్ ఇంజనీరింగ్, హైదరాబాద్.
  2. మణిపాల్ యూనివర్సిటీ ఆఫ్ టెక్నాలజీ, మణిపాల్ యూనివర్సిటీ, మణిపాల్.
  3. హిందుస్తాన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్స్, హిందుస్తాన్ యూనివర్సిటీ, చెన్నై.
  4. ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఏరోనాటికల్ అండ్ మెరైన్ ఇంజనీరింగ్, బెంగళూరు.
  5. PEC యూనివర్సిటీ ఆఫ్ టెక్నాలజీ, చండీగఢ్.
  6. మద్రాస్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ, అన్న యూనివర్సిటీ, చెన్నై.
  7. ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఏరోనాటికల్ ఇంజనీరింగ్ & ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ(IIAEIT), పూణే.
  8. CIIAE(సెంటర్ ఫర్ ఇంటర్నేషనల్లి రికాగ్నైజ్డ్ ఏరోనాటికల్/ఏరోస్పేస్/ఎయిర్ క్రాఫ్ట్ ఇంజనీరింగ్), డెహ్రాడూన్.
  9. ఇండియన్ అకాడమీ ఆఫ్ ఏరోనాటికల్ టెక్నాలజీ, లక్నో.
Read Also..  Instrumentation Engineering Course Details in Telugu

Share this Article with Ur Frnds..