Civil Engineering Course Details in Telugu

Share this article with your friends

ఇంటర్మీడియట్ పూర్తి చేసిన తర్వాత విద్యార్ధులు తమ కెరీర్ లో ఉన్నత చదువుల కోసం ఏ కోర్సును ఎంపిక చేసుకోవాలో తెలియక తర్జనభర్జన పడుతుంటారు. అటువంటి వారికోసం CBSE (Central Board of Secondary Education) చే గుర్తించబడిన 113 రకాల కోర్సులలో ఒక్కొక్క కోర్సు గురించి వివరించడం జరిగింది. దీని ద్వారా విద్యార్ధులు  ఏ రంగంలో ఎటువంటి కోర్సులు ఉన్నాయో తెలుసుకొని, తమకు నచ్చిన రంగంలో కోర్సును ఎంపిక చేసుకొని జీవితంలో ఉన్నత స్థాయిలో స్థిరపడవచ్చు.  అందులో బాగంగా CBSE చే గుర్తించబడిన 113 రకాల కోర్సులలో సివిల్ ఇంజనీరింగ్ (Civil Engineering) కోర్సు గురించి వివరణ.

సివిల్ ఇంజనీరింగ్ (Civil Engineering)

పరిచయం(Introduction):

సివిల్ ఇంజనీరింగ్ లో నిర్మాణ పనుల ప్రణాళిక, రూపకల్పన మరియు అమలుచేయడం వంటివి ఉంటాయి. ఈ కోర్సు రోడ్లు, వంతెనలు, సొరంగాలు, భవనాలు, విమానాశ్రయాలు, ఆనకట్టలు, నీటి పనులు , మూరుగునీటి వ్యవస్థలు, ఓడ రేవులు, మొదలైన పబ్లిక్ పనుల రూపకల్పన, పర్యవేక్షణ మరియు నిర్మాణ కార్యకలపాలతో సహ అనేక రకాల ఇంజనీరింగ్ పనులతో వ్యవహరిస్తుంది. మరియు అనేక సవాలుగా ఉండే కెరీర్ అవకాశాలను అందిస్తుంది. సివిల్ ఇంజనీర్ ఒక ప్రాజెక్టును ప్లాన్ చేయడం మరియు రూపకల్పన చేయడం, అవసరమైన స్థాయికి ప్రాజెక్టును నిర్మించడం మరియు ఉత్పత్తి నిర్వహణ భాద్యత వహిస్తాడు.

Read Also..  Polytechnic Diploma Course Details in Telugu

సివిల్ ఇంజనీరింగ్ లోని ప్రధాన స్పెషలైజేషన్లు నిర్మాణ, నీటి వనరులు, పర్యావరణ, నిర్మాణం, రవాణా, జియో-టెక్నికల్ ఇంజనీరింగ్ మొదలైనవి.

కోర్సుల వివరాలు:
  1. B.Tech
  2. M.Tech (Dual Degree)
  3. Ph.D
అర్హతలు(Eligibility):

గుర్తింపు పొందిన బోర్డు/యూనివర్సిటీ నుండి ఫిజిక్స్, కెమిస్ట్రీ మరియు మ్యాథమెటిక్స్ లో 10+2 ఉత్తీర్ణత సాధించి ఉండాలి.

సంస్థలు/విశ్వవిద్యాలయాలు(Institutes/Universities):

ఇక్కడ భారతదేశంలో ఉన్న కొన్ని ముఖ్యమైన సంస్థలు(Institutes), విశ్వవిద్యాలయాలు(Universities) ల గురించి CBSE Manual లో తెలిపిన ప్రకారం వివరించడం జరిగింది. వివిధ రాష్ట్రాలలో ఉన్న విద్యాసంస్థలు, యూనివర్సిటీలలో కూడా పైన తెల్పిన కోర్సులు అందుబాటులో ఉండవచ్చు. విద్యార్ధులు తమ దగ్గరలో, అందుబాటులో ఉన్న  విద్యాసంస్థలు, యూనివర్సిటీలలో మీరు ఎంపిక చేసుకున్న కోర్సులు ఉన్నాయో, లేవో తెలుసుకొని అడ్మిషన్ పొందగలరు.

  1. ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (IIT) – ఖరగ్ పూర్, వెస్ట్ బెంగాల్, భారతదేశం. (Indian Institute of Technology (IIT) – Kharagpur, West Bengal, India.)
  2. ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (IIT) – కాన్పూర్, ఉత్తర్ ప్రదేశ్, భారతదేశం. (Indian Institute of Technology (IIT) – Kanpur, Uttar Pradesh, India.)
  3. యూనివర్సిటీ ఆఫ్ కాలికట్ – త్రిశూర్, మళప్పురం, కేరళ, భారతదేశం. (University of Calicut – Thrishur, Malappuram, Kerala, India)
  4. అలియా యూనివర్సిటీ – కలకత్తా, వెస్ట్ బెంగాల్, భారతదేశం. (Aliah University – Kolkata, West Bengal, India.)
  5. ఆంధ్ర యూనివర్సిటీ – విశాఖపట్నం, ఆంధ్ర ప్రదేశ్, భారతదేశం. (Andhra University – Vishakhapatnam, Andhra Pradesh, India.)
  6. రాజస్థాన్ టెక్నికల్ యూనివర్సిటీ – కోట, రాజస్థాన్, భారతదేశం. (Rajasthan Technical University – Kota Rajasthan, India.)
  7. గురు గోబింద్ సింగ్ ఇంద్రప్రస్తా యూనివర్సిటీ – ఢిల్లీ, భారతదేశం. (Guru Gobind Singh Indraprastha University – Delhi, India.)
  8. ఇందిరా గాంధీ నేషనల్ ఓపెన్ యూనివర్సిటీ – న్యూఢిల్లీ,  భారతదేశం. (Indira Gandhi National Open University – New Delhi, India.) (http://www.ignou.ac.in/)
Read Also..  Ceramics Engineering Course Details in Telugu

Share this article with your friends