Biomedical Engineering Course Details in Telugu

Share this article with your friends

ఇంటర్మీడియట్ పూర్తి చేసిన తర్వాత విద్యార్ధులు తమ కెరీర్ లో ఉన్నత చదువుల కోసం ఏ కోర్సును ఎంపిక చేసుకోవాలో తెలియక తర్జనభర్జన పడుతుంటారు. అటువంటి వారికోసం CBSE (Central Board of Secondary Education) చే గుర్తించబడిన 113 రకాల కోర్సులలో ఒక్కొక్క కోర్సు గురించి వివరించడం జరిగింది. దీని ద్వారా విద్యార్ధులు  ఏ రంగంలో ఎటువంటి కోర్సులు ఉన్నాయో తెలుసుకొని, తమకు నచ్చిన రంగంలో కోర్సును ఎంపిక చేసుకొని జీవితంలో ఉన్నత స్థాయిలో స్థిరపడవచ్చు.  అందులో బాగంగా CBSE చే గుర్తించబడిన 113 రకాల కోర్సులలో బయోమెడికల్ ఇంజనీరింగ్  (Biomedical Engineering) కోర్సు గురించి వివరణ.

బయోమెడికల్ ఇంజనీరింగ్  (Biomedical Engineering)

పరిచయం(Introduction):

బయో మెడికల్ ఇంజనీరింగ్ అనేది ప్రొస్థేసెస్, మెడికల్ ఎక్విప్మెంట్ , డియాగ్నస్టిక్ పరికరాలు మరియు డ్రగ్స్ వంటి మెడికల్ సెక్టార్ లో వర్తించే ఇంజనీరింగ్ అధ్యయనం. ఈ రంగంలోని నిపుణులను బయోమెడికల్ ఇంజనీర్లు ఆరోగ్య సంరక్షణను మెరుగుపరచడానికి ఇంజనీరింగ్ పద్దతులు మరియు సిద్దాంతలను ఉపయోగించుకుంటారు. ఆర్థోపెడిక్ మరియు రిహాబిలిటేషన్ ఇంజనీరింగ్, మాలిక్యులర్, సెల్యులార్ మరియు టిష్యూ ఇంజనీరింగ్ కూడా ఈ విభాగంలో ఒక భాగం.

Read Also..  Automobile Engineering Course Details in Telugu
కోర్సుల వివరాలు:
  1. B.Sc ఇన్ బయోమెడికల్ సైన్స్ (B.Sc in Biomedical Science)
  2. B.Tech ఇన్ బయోమెడికల్ ఇంజనీరింగ్ (B.Tech in Biomedical Engineering)
  3. డ్యుయల్ డిగ్రీ ప్రోగ్రామ్స్ (Dual Degree Programmes)
  4. Ph.D ప్రోగ్రామ్ ఇన్ బయోమెడికల్ సైన్స్ (Ph.D Programme in Biomedical Science)
అర్హతలు(Eligibility):

బయాలజీ, కెమిస్ట్రీ మరియు మ్యాథమెటిక్స్ లో 10+2 లో ఉత్తీర్ణత. (IIT కొరకు  జాయింట్ ఎంట్రన్స్ ఎక్సామ్ (JEE) తప్పనిసరిగా క్వాలిఫై అవ్వాల్సి ఉంటుంది. ఈ కోర్సు యొక్క డ్యూరేషన్ 4 సంవత్సరాలు ఉంటుంది.)

సంస్థలు/విశ్వవిద్యాలయాలు(Institutes/Universities):

ఇక్కడ భారతదేశంలో ఉన్న కొన్ని ముఖ్యమైన సంస్థలు(Institutes), విశ్వవిద్యాలయాలు(Universities) ల గురించి CBSE Manual లో తెలిపిన ప్రకారం వివరించడం జరిగింది. వివిధ రాష్ట్రాలలో ఉన్న విద్యాసంస్థలు, యూనివర్సిటీలలో కూడా పైన తెల్పిన కోర్సులు అందుబాటులో ఉండవచ్చు. విద్యార్ధులు తమ దగ్గరలో, అందుబాటులో ఉన్న  విద్యాసంస్థలు, యూనివర్సిటీలలో మీరు ఎంపిక చేసుకున్న కోర్సులు ఉన్నాయో, లేవో తెలుసుకొని అడ్మిషన్ పొందగలరు.

  1. ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ – గౌతమ్ నగర్, అన్సారీ నగర్ ఈస్ట్ , న్యూఢిల్లీ, ఇండియా. (All India Institute of Medical Sciences – Gautam Nagar, Ansari Nagar East, New Delhi, India.)
  2. B.R. అంబేద్కర్ సెంటర్ ఆఫ్ బయోమెడికల్ రిసెర్చ్ – యూనివర్సిటీ ఆఫ్ ఢిల్లీ, న్యూఢిల్లీ, ఇండియా. (Dr. B.R. Ambedkar Center for Biomedical Research – University of Delhi, New Delhi, India.)
  3. ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (IIT BHU) – వారణాసి, ఉత్తర్ ప్రదేశ్, ఇండియా. (Inidian Institute of Technology (IIT BHU)- Varanasi, Uttar Pradesh, India.)
  4. డిపార్ట్మెంట్ ఆఫ్ బయోమెడికల్ ఇంజనీరింగ్ (యూనివర్సిటీ కాలేజీ ఆఫ్ ఇంజనీరింగ్) – ఉస్మానియా యూనివర్సిటీ, హైదరాబాద్, తెలంగాణ, ఇండియా. (Department of Bio Medical Engineering (University College of Engineering) – Osmania University, Hyderabad, Telangana, India.)
  5. గవర్నమెంట్ మోడల్ ఇంజనీరింగ్ కాలేజీ – కోచ్చి, కేరళ, ఇండియా. (Government Model Engineering College – Kochi, Kerala, India.)
Read Also..  Information Communication and Entertainment Course Details

Share this article with your friends