Robotics Course Details in Telugu

Share this article with your friends

ఇంటర్మీడియట్ పూర్తి చేసిన తర్వాత విద్యార్ధులు తమ కెరీర్ లో ఉన్నత చదువుల కోసం ఏ కోర్సును ఎంపిక చేసుకోవాలో తెలియక తర్జనభర్జన పడుతుంటారు. అటువంటి వారికోసం CBSE (Central Board of Secondary Education) చే గుర్తించబడిన 113 రకాల కోర్సులలో ఒక్కొక్క కోర్సు గురించి వివరించడం జరిగింది. దీని ద్వారా విద్యార్ధులు  ఏ రంగంలో ఎటువంటి కోర్సులు ఉన్నాయో తెలుసుకొని, తమకు నచ్చిన రంగంలో కోర్సును ఎంపిక చేసుకొని జీవితంలో ఉన్నత స్థాయిలో స్థిరపడవచ్చు.   అందులో బాగంగా CBSE చే గుర్తించబడిన 113 రకాల కోర్సులలో రోబోటిక్స్ (Robotics) కోర్సు గురించి వివరణ.

రోబోటిక్స్ (Robotics)

పరిచయం(Introduction):

రోబోటిక్స్ అనేది ఇంటర్-డిసిప్లీనరీ కోర్సు మరియు మెకానికల్ ఇంజనీరింగ్, ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్, ఇన్స్ట్రుమెంటేషన్ ఇంజనీరింగ్ లేదా కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్ విద్యార్దులు ఆ రంగంలో చేరవచ్చు. రోబోటిక్స్(Robotics) మరియు కృతిమ మేదస్సు(Artificial Intelligence) ఒక దానితో ఒకటి అనుసంధానించబడి ఉంటాయి. మరియు మాస్టర్స్ స్థాయిలో ఎంపిక ఉంది.

Read Also..  Computer Science Engineering Course Details in Telugu
కోర్సుల వివరాలు:
  1. బ్యాచిలర్ ఆఫ్ టెక్నాలజీ (Bachelor of Technology)
  2. బ్యాచిలర్ ఆఫ్ ఇంజనీరింగ్ (Bachelor of Engineering)
  3. M.Tech. ఇన్ రోబోటిక్స్ అండ్ M.Tech. ఇన్ ఆర్టిఫీషియల్ ఇంటెలిజన్స్ (M.Tech in Robotics & M.Tech in Artificial Intelligence)
  4. M.Tech. ఇన్ రోబోటిక్స్ ఇంజనీరింగ్ (M.Tech in Robotics Engineering)
  5. M.Tech. ఇన్ ఆటోమేషన్ అండ్ రోబోటిక్స్ (M.Tech in Automation and Robotics)
  6. డిప్లొమా ఇన్ రోబోటిక్స్ (Diploma in Robotics)
అర్హతలు(Eligibility):

బయాలజీ, కెమిస్ట్రీ మరియు మ్యాథమెటిక్స్ లో 10+2 లో ఉత్తీర్ణత. (IIT కొరకు  జాయింట్ ఎంట్రన్స్ ఎక్సామ్ (JEE) తప్పనిసరిగా క్వాలిఫై అవ్వాల్సి ఉంటుంది. ఈ కోర్సు యొక్క డ్యూరేషన్ 4 సంవత్సరాలు ఉంటుంది.)

సంస్థలు/విశ్వవిద్యాలయాలు(Institutes/Universities):

ఇక్కడ భారతదేశంలో ఉన్న కొన్ని ముఖ్యమైన సంస్థలు(Institutes), విశ్వవిద్యాలయాలు(Universities) ల గురించి CBSE Manual లో తెలిపిన ప్రకారం వివరించడం జరిగింది. వివిధ రాష్ట్రాలలో ఉన్న విద్యాసంస్థలు,యూనివర్సిటీలలో కూడా పైన తెల్పిన కోర్సులు అందుబాటులో ఉండవచ్చు. విద్యార్ధులు తమ దగ్గరలో, అందుబాటులో ఉన్న  విద్యాసంస్థలు, యూనివర్సిటీలలో మీరు ఎంపిక చేసుకున్న కోర్సులు ఉన్నాయో, లేవో తెలుసుకొని అడ్మిషన్ పొందగలరు.

  1. IISc, బెంగళూరు, కర్ణాటక. (Indian Institute of Science, Bengaluru, Karnataka)
  2. యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్, హైదరాబాద్, తెలంగాణ. (University of Hyderabad, Hyderabad, Telangana)
  3. IIT – ముంబై, మహారాష్ట్ర. (Indian Institute of Technology, Mumbai, Maharashtra)
  4. IIT – చెన్నై, తమిళనాడు. (Indian Institute of Technology, Chennai, Tamil Nadu)
  5. IIT – ఖరగ్ పూర్, వెస్ట్ బెంగాల్. (Indian Institute of Technology, Kharagpur, West Bengal)
  6. IIT – ఢిల్లీ, న్యూ ఢిల్లీ. (Indian Institute of Technology – Delhi, New Delhi)
  7. IIT – కాన్పూర్, ఉత్తర్ ప్రదేశ్. (Indian Institute of Technology – Kanpur, Uttar Pradesh)
  8. బిర్లా ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్స్(BITS – Pilani) – పిలాని, రాజస్థాన్. (Birla Institute of Technology and Science (BITS – Pilani) – Pilani, Rajasthan.
  9. నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (NIT) – సిల్చార్, అస్సాం. (National Institute of Technology (NIT) – Silchar, Assam.
Read Also..  Courses after Intermediate in Telugu

Share this article with your friends