BCA Course Details in Telugu

Share this article with your friends

BCA కోర్సు అంటే ఏమిటి.?? ఈ కోర్సు పూర్తి చేసిన వారికి ఉద్యోగ అవకాశాలు ఏలా ఉంటాయి..??  జాబ్ లో జాయిన్ అయితే జీతం ఎంత ఉంటుంది.?? ఈ కోర్సులో ముఖ్యమైన అర్హతలు ఏమిటి..?? కోర్సు యొక్క వ్యవధి..??  ఎంత ఫీజు ఉంటుంది..?? కోర్సు యొక్క సిలబస్..??  ఒకవేళ చదువును కొనసాగించాలంటే ఎటువంటి కోర్సులు అందుబాటులో ఉన్నాయి..??  ఉద్యోగ అవకాశాన్ని కల్పించే సంస్థలు గురించి మరింత సమాచారం మీకోసం..

BCA అంటే ఏమిటి?
  • ఆధునిక ప్రోగ్రామింగ్ భాషలను నేర్చుకోవడం ద్వారా కంప్యూటర్ అప్లికేషన్ డెవలప్‌మెంట్ నేర్చుకోవాలనుకునే విద్యార్థుల కోసం BCA అనేది  3 సంవత్సరాల అండర్-గ్రాడ్యుయేట్ డిగ్రీ కోర్సు.
  • ఇంటర్మీడియట్ పూర్తి చేసిన తర్వాత ఈ BCA కోర్సు లో జాయిన్ అవ్వవచ్చు.
కెరీర్ అవకాశాలు  (BCA కోర్సు తర్వాత):

BCA కోర్సు పూర్తి అయిన తర్వాత ఒకవేళ ఉద్యోగం చేయాలనుకుంటే ఉద్యోగ అవకాశాలు ఈ క్రింది విధంగా ఉంటాయి.

  1. చీఫ్ ఇన్ఫర్మేషన్ ఆఫీసర్ (Chief Information Officer)
  2. సిస్టమ్ ఇంజనీర్ (System Engineer)
  3. వెబ్ డెవెలపర్ (Web Developer)
  4. ప్రోగ్రామర్ (Programmer)
  5. ఇన్ఫర్మేషన్ సిస్టమ్ మేనేజర్ (Information Systems Manager)
  6. కమర్షియల్ అండ్ ఇండస్ట్రియల్ డిసైనర్స్ (Commercial and Industrial Designers)
  7. సాఫ్ట్ వేర్ పుబ్లిషర్స్ అండ్ టెస్టర్స్ (Software Publishers and Testers)
  8. కంప్యూటర్ సిస్టమ్స్ అనలిస్ట్ అండ్ సైంటిస్ట్స్ (Computer Systems Analysts and Scientists)
  9. కంప్యూటర్ ప్రోగ్రామర్స్ అండ్ ట్రైనీస్ (Computer Programmers and Trainees)
  10. కంప్యూటర్ సపోర్ట్ సర్విస్ అండ్ ప్రెసెంటేషన్ స్పెషలిస్ట్ (Computer Support Service and Presentation Specialist)
  11. మల్టీమీడియా అండ్ నెట్వర్కింగ్ ట్రైనీ (Multimedia and Networking Trainee)
  12. డాటాబేస్ అడ్మినిస్ట్రేటర్స్  (Database Administrators)
  13. ఇండెపెండెంట్ కన్సల్టెంట్స్ (Independent Consultants)
  14. కాలేజీ/ఇన్స్టిట్యూట్ లో ఫ్యాకల్టీ ట్రైనర్ (Faculty as Trainer in Colleges/Institutes)
  15. సిస్టమ్ ఇంజనీర్ ట్రైనీ (System Engineer Trainee)
  16. ప్రాజెక్టు మేనేజర్ (Project Manager)
  17. ట్రైనీ ప్రోగ్రామర్ మొదలైనవి.. (Trainee Programmer etc..)
Salary (జీతం) (BCA కోర్సు పూర్తి చేసిన తర్వాత ఉద్యోగం చేయాలనుకుంటే):
  • BCA గ్రాడ్యుయేట్ శ్రేణులకు ఫ్రెషర్ స్టూడెంట్ ఆఫర్ కోసం సగటు జీతం(Minimum) – Rs.20,000 – 25,000 (per Month)
  • బిగ్ MNC(Multi National Company)లో కంప్యూటర్ ప్రొఫెషనల్‌కి ఆఫర్ చేస్తున్న సగటు జీతం(Minimum) – Rs.25,000 – 40,000 (per Month)
Read Also..  Manufacturing Science and Engineering Course Details
అర్హత (Eligibility):

ఒకవేళ విద్యార్ధులు BCA కోర్సు లో జాయిన్ అవ్వాలంటే ఈ క్రింది అర్హతలు ఉండాలి.

  • విద్యార్థులు గుర్తింపు పొందిన యూనివర్సిటీ/బోర్డు నుండి 10+2 లేదా ఇంటర్మీడియట్  MPC గ్రూపులో 55% మార్కులతో ఉత్తీర్ణత సాధించాలి.   (లేదా)   విద్యార్థులు గుర్తింపు పొందిన యూనివర్సిటీ/బోర్డు నుండి 10+2 లేదా ఇంటర్మీడియట్ లో  Mathematics ఒక సబ్జెక్టు గా 55% మార్కులతో ఉత్తీర్ణత సాధించాలి.
  • దేశవ్యాప్తంగా ఉన్న కొన్ని రకాల ప్రముఖ ఇన్స్టిట్యూట్ లలో విద్యార్థులు BCA కోర్సు చేయాలనుకుంటే ఇన్స్టిట్యూట్ వారు నిర్వహించే ఎంట్రన్స్ ఎగ్జామ్ ను రాయాల్సి ఉంటుంది.
కోర్సు యొక్క వ్యవధి:
  1. BCA కోర్సు యొక్క వ్యవధి 3 సంవత్సరాలు/6 సెమిస్టర్లు.
  2. ప్రతి సంవత్సరం 2 సెమిస్టర్ల చొప్పున మొత్తం 6 సెమిస్టర్లు ఉంటాయి.
Mode of Course:

రెగ్యులర్ మరియు డిస్టెన్స్ విధానంలో ఈ కోర్సు అందుబాటులో ఉంది.

ఫీజు  (BCA కోర్సులో చేరాలంటే) :

గవర్నమెంట్ ఇన్‌స్టిట్యూట్‌లలో Rs. 80,000 నుండి 2,00,000 ల వరకు ప్రైవేట్ ఇన్‌స్టిట్యూట్‌ లలో Rs.1,50,000 నుండి 3,50,000 ల వరకు ఉంటుంది.

BCA యొక్క సిలబస్:
1st Semester

Theory:

  1. డిజిటల్ కంప్యూటర్ ఫండమెంటల్స్ (Digital Computer Fundamentals)
  2. క్రియేటివ్ ఇంగ్లీష్ (Creative English)
  3. ఫండమెంటల్ మ్యాథమెటిక్స్ (Fundamental Mathematics)
  4. ఇంట్రడక్షన్ టు ప్రోగ్రామ్మింగ్ యూసింగ్ C లాంగ్వేజ్ (Introduction to Programming using C Language)
  5. స్టాటిస్టిక్స్-I ఫర్ BCA (Statistics-I for BCA)

Practical’s:

  1. C ప్రోగ్రామ్మింగ్ ల్యాబ్ అండ్ PC సాఫ్ట్ వేర్ ల్యాబ్ (C Programming Lab and PC Software Lab)
  2. హార్డ్ వేర్ ల్యాబ్ (Hardware Lab)
2nd Semester

Theory:

  1. కమ్యునికేటివ్ ఇంగ్లీష్ (Communicative English)
  2. బేసిక్ డిస్క్రీట్ మ్యాథమెటిక్స్ (Basic Discrete Mathematics)
  3. ఆపరేటింగ్ సిస్టమ్స్ (Operating Systems)
  4. డాటా స్ట్రక్చర్స్ (Data Structures)

Practical’s:

  1. డాటా స్ట్రక్చర్స్ ల్యాబ్ (Data Structures Lab)
  2. విజువల్ ప్రోగ్రామ్మింగ్ ల్యాబ్ (Visual Programming Lab)
  3. కేస్ టూల్స్ ల్యాబ్ (Case Tools Lab)
3rd Semester

Theory:

  1. డాటాబేస్ మేనేజ్మెంట్ సిస్టమ్స్ (Database Management Systems)
  2. ఇంటర్ పర్సనల్ కమ్యూనికేషన్ (Interpersonal Communication)
  3. ఫైనాన్షియల్ అకౌంటింగ్ (Financial Accounting)
  4. ఇన్ట్రోడక్టరి ఆల్జీబ్రా (Introductory Algebra)
  5. ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామ్మింగ్ యూసింగ్ C++ (Object Oriented Programming using C++)
  6. సాఫ్ట్ వేర్ ఇంజనీరింగ్ (Software Engineering)

Practical’s:

  1. C++ ల్యాబ్ (C++ Lab)
  2. ఓరాకిల్ ల్యాబ్ అండ్ డొమైన్ ల్యాబ్ (Oracle Lab and Domain Lab)
4th Semester

Theory:

  1. కంప్యూటర్ నెట్ వర్క్స్ (Computer Networks)
  2. ఫైనాన్షియల్ మేనేజ్మెంట్ (Financial Management)
  3. ప్రొఫెషనల్ ఇంగ్లీష్ (Professional English)
  4. ప్రోగ్రామింగ్ ఇన్ జావా (Programming in Java)
Read Also..  Biomedical Engineering Course Details in Telugu

Practical’s:

  1. జావా ప్రోగ్రామ్మింగ్ ల్యాబ్ (Java Programming Lab)
  2. DBMS ప్రాజెక్ట్ ల్యాబ్ (DBMS Project Lab)
  3. వెబ్ టెక్నాలజీ ల్యాబ్ (Web Technology Lab)
  4. లాంగ్వేజ్ ల్యాబ్ (Language Lab)
5th Semester

Theory:

  1. బిజినెస్ ఇంటెలిజన్స్ (Business Intelligence)
  2. గ్రాఫిక్స్ అండ్ యానిమేషన్ (Graphics and Animation)
  3. OOAD యూసింగ్ UML (OOAD using UML)
  4. పైతాన్ ప్రోగ్రామ్మింగ్ (Python Programming)
  5. UNIX ప్రోగ్రామ్మింగ్ (UNIX Programming)
  6. యూసర్ ఇంటర్ఫేస్ డిజైన్ (User Interface Design)

Practical’s:

  1. UNIX ల్యాబ్ (UNIX Lab)
  2. గ్రాఫిక్స్ అండ్ యానిమేషన్ ల్యాబ్ (Graphics and Animation Lab)
  3. పైతాన్ ప్రోగ్రామ్మింగ్ ల్యాబ్ (Python Programming Lab)
  4. బిజినెస్ ఇంటెలిజన్స్ ల్యాబ్ అండ్ వెబ్ డిజైనింగ్ ప్రాజెక్టు (Business Intelligence Lab and Web Designing Project)

6th Semester

  1. అడ్వాన్స్డ్ డాటాబేస్ మేనేజ్మెంట్ సిస్టమ్ (Advanced Database Management System)
  2. క్లౌడ్ కంప్యూటింగ్ (Cloud Computing)
  3. క్లయింట్ సర్వర్ కంప్యూటింగ్ (Client Server Computing)
  4. కంప్యూటర్ ఆర్కిటెక్చర్ (Computer Architecture)
  5. డిజైన్ అండ్ అనాలసిస్ ఆఫ్ అల్గారితమ్స్ (Design and Analysis of Algorithms)
  6. మల్టిమీడియా అప్లికేషన్స్ (Multimedia Applications)
  7. ఇంట్రడక్షన్ టు సాఫ్ట్ వేర్ కంప్యూటింగ్ (Introduction to Software Computing)
కోర్సుల వివరాలు  (BCA తర్వాత చదువు కొనసాగించాలంటే) :
  • MCA (Master of Computer Application)
  • MCM (Masters in Computer Management)
  • ISM (Information Security Management)
  • MIM (Master Degree in Information Management)
  • PGPCM (Postgraduate Program in Corporate Studies)
  • MBA (Master of Business Administration)
కెరీర్ (Career):

భారతదేశంలోనే కాకుండా విదేశాల్లో కూడా ఐటీ నిపుణుల డిమాండ్ పెరుగుతోంది. కోర్సు పూర్తయిన తర్వాత BCA విద్యార్థి IBM, Oracle, Infosys, Google వంటి ప్రసిద్ధ IT కంపెనీలలో ఉద్యోగం పొందవచ్చు.  సిస్టమ్ ఇంజనీర్‌గా, జూనియర్ ప్రోగ్రామర్‌గా, వెబ్ డెవలపర్‌గా లేదా సిస్టమ్‌ నిర్వాహకుడు గా పని చేయవచ్చు.

సిస్టమ్ ఇంజనీర్ (System Engineer) :

Infosys, HP, Google, Wipro వంటి టాప్ కంపెనీలలో సిస్టమ్ ఇంజనీర్ గా ఉద్యోగం చేయవచ్చు. సాఫ్ట్‌వేర్ సర్క్యూట్‌లు మరియు పర్సనల్ కంప్యూటర్‌ను అభివృద్ధి చేయడం, పరీక్షించడం మరియు ఎవాల్యూవేట్  చేయడం సిస్టమ్ ఇంజనీర్ యొక్క ముఖ్యమైన విధి.

ప్రోగ్రామర్ (Programmer):

వివిధ సాఫ్ట్‌వేర్ డెవలప్‌మెంట్ సంస్థలలో ప్రోగ్రామర్ గా ఉద్యోగం చేయవచ్చు. సాఫ్ట్‌వేర్ కోసం కోడ్ రాయడం ప్రోగ్రామర్ విధి. ASSEMBLY, COBOL, C, C++, C#, Java lisp, Python మొదలైన వాటిలో కంప్యూటర్‌ ప్రోగ్రామింగ్ చేయడం ప్రోగ్రామర్ యొక్క ముఖ్యమైన విధి.

వెబ్ డెవెలపర్ (Web Developer):

వివిధ వెబ్ డిజైనింగ్ కంపెనీలు మరియు ఆన్‌లైన్ డిజిటల్ మార్కెటింగ్ కంపెనీలలో వెబ్ డెవలపర్ గా ఉద్యోగం చేయవచ్చు. వెబ్ డెవలపర్ అనేది వరల్డ్ వైడ్ వెబ్ అప్లికేషన్ల అభివృద్ధిలో నైపుణ్యం కలిగిన ప్రోగ్రామర్ వెబ్‌సైట్‌లను రూపొందించడం మరియు నిర్వహించడం వెబ్ డెవలపర్ యొక్క ముఖ్య పాత్ర. వెబ్ డెవలపర్ HTML/XHTML, CSS, PHP, Java Script మొదలైన వాటిలో తప్పనిసరిగా నైపుణ్యాలను కలిగి ఉండాలి.

Read Also..  Artificial Intelligence & Machine Learning Course Details In Telugu

సిస్టమ్ అడ్మినిస్ట్రేటర్ (System Administrator):

కంప్యూటర్ సిస్టమ్ యొక్క నిర్వహణ, కన్ఫిగరేషన్ మరియు విశ్వాసనీయమైన ఆపరేషన్ కు బాధ్యత వహించే వ్యక్తి, ముఖ్యంగా సర్వర్ల వంటి వాటిని మెయిన్టేన్ చేయడం సిస్టమ్ అడ్మినిస్ట్రేటర్ యొక్క ముఖ్యమైన విధి.

ఉద్యోగ అవకాశాలు కల్పించే కొన్ని రకాల సంస్థలు  (BCA కోర్సు పూర్తి అయిన తర్వాత) :
  1. TCS
  2. NIIT
  3. JENPACT
  4. విప్రో (Wipro)
  5. సింటెల్ (Syntel)
  6. ఇన్ఫోసిస్ (Infosys)
  7. అసెంచర్ (Accenture)
  8. కాగ్నిజెంట్ (Cognizant)
  9. జెన్ ఫోకస్ (Zen Focus)
  10. AON హెవిట్ (AON Hewitt)
  11. ICS సొల్యూషన్స్ (ICS Solutions)
  12. HCL టెక్నాలజీస్ (HCL Technologies)
  13. సన్‌లైఫ్ టెక్నాలజీస్ (SunLife Technologies)  
  14. అరిసెంట్ టెక్నాలజీస్ (Aricent Technologies)
  15. హెక్సావేర్ టెక్నాలజీస్ లిమిటెడ్ (Hexaware Technologies Limited)
  16. L&T లార్సెన్ మరియు టూబ్రో ఇన్ఫోటెక్ (L&T Larsen and Toubro Infotech) మొదలైనవి.
అవసరమైన నైపుణ్యాలు (Skills) :
  • స్ట్రాంగ్ ప్రోగ్రామింగ్ (Strong Programming) మరియు సాంకేతిక నైపుణ్యాలు (Technical Skills) సమస్యలను పరిష్కరిస్తామన్న విశ్వాసం.
  • కంప్యూటర్ మరియు ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ పైన పరిజ్ఞానం(knowledge).
  • విశ్లేషణాత్మక ఆలోచన (Analytical thinking) మరియు మంచి సృజనాత్మకత నైపుణ్యాలు (Good Creativity Skills)
  • మంచి కమ్యూనికేషన్ (Good communication) మరియు ప్రవర్తనా నైపుణ్యాలు (Behavioral Skills)
  • సామర్థ్యాన్ని అభివృద్ధి చేసే ఆచరణాత్మక అంశాలు.
  • లేటెస్ట్ టెక్నాలజీ ట్రెండ్స్‌పై అవగాహన
  • సానుకూల వైఖరి (Positive Attitude) మరియు టీం వర్క్.
ముఖ్యమైన విషయాలు (Important Points):
  • BCA రంగంలో భారీ స్కోప్ ఉంది. కోర్సు పూర్తి అయిన తర్వాత ఉద్యోగం చేయవచ్చు లేదా ఉన్నత చదువులకు వెళ్లవచ్చు.
  • BCA గ్రాడ్యుయేట్‌లకు ఉద్యోగాలను అందించే అనేక సాఫ్ట్‌వేర్ MNCల బహుళజాతి కంపెనీలు ఉన్నాయి.
  • ఈ కోర్సు పూర్తి చేయడం వలన స్వయం ఉపాధి అవకాశాన్ని కూడా ఎంచుకోవచ్చు.
  • మీరు టెక్నికల్ గా చాలా నైపుణ్యాలను కలిగి ఉంటే మీరు స్వంతంగా సాఫ్ట్‌వేర్‌ను ఫ్రీలాన్సింగ్ చేయవచ్చు లేదా అభివృద్ధి చేయవచ్చు.
  • మీకు ఈ రంగంలో లోతైన జ్ఞానం కావాలంటే, మీరు MCA మరియు PHD వంటి అధునాతన కోర్సులకు వెళ్లవచ్చు.
  • MCA పూర్తయిన తర్వాత అభ్యర్ధులు ఏదైనా పేరున్న వాటిలో లెక్చరర్ ఉద్యోగాన్ని కూడా పొందవచ్చు.

Read Also… Polytechnic Diploma Course Details in Telugu
Read Also… Nursing Course Details in Telugu
Read Also… Courses after Intermediate in Telugu
Read Also… List of ITI Trades/Courses Affiliated to NCVT

Share this article with your friends