ఇంటర్మీడియట్ పూర్తి చేసిన తర్వాత విద్యార్ధులు తమ కెరీర్ లో ఉన్నత చదువుల కోసం ఏ కోర్సును ఎంపిక చేసుకోవాలో తెలియక తర్జనభర్జన పడుతుంటారు. అటువంటి వారికోసం CBSE (Central Board of Secondary Education) చే గుర్తించబడిన 113 రకాల కోర్సులలో ఒక్కొక్క కోర్సు గురించి వివరించడం జరిగింది. దీని ద్వారా విద్యార్ధులు ఏ రంగంలో ఎటువంటి కోర్సులు ఉన్నాయో తెలుసుకొని, తమకు నచ్చిన రంగంలో కోర్సును ఎంపిక చేసుకొని జీవితంలో ఉన్నత స్థాయిలో స్థిరపడవచ్చు. అందులో బాగంగా CBSE చే గుర్తించబడిన 113 రకాల కోర్సులలో ఆర్కిటెక్చర్ ఇంజనీరింగ్ (Architecture Engineering) కోర్సు గురించి వివరణ.
ఆర్కిటెక్చర్ ఇంజనీరింగ్ (Architecture Engineering)
పరిచయం(Introduction):
ఆర్కిటెక్చర్ ఇంజనీరింగ్ అనేది గృహాలు, కార్యాలయ భవనాలు, ఆకాశహర్మ్యాలు, ప్రకృతి దృశ్యాలు లేదా మొత్తం నగరాల కోసం నిర్మాణ పనుల ప్రణాళికా, రూపకల్పన, భద్రత, స్థోమత, మరియు పర్యవేక్షణతో వ్యవహరించే శాస్త్రం.
కోర్సుల వివరాలు:
- B.Arch. (బ్యాచిలర్ ఆఫ్ ఆర్కిటెక్చర్)
- B.Arch. (మాస్టర్ ఆఫ్ ఆర్కిటెక్చర్)
- Ph.D. ప్రోగ్రాములు (Ph.D. Programs)
అర్హతలు(Eligibility):
- సైన్స్ స్ట్రీమ్ లో 10+2 స్థాయి అర్హత ఉండాలి.
- IITలు JEE స్కోర్ ను పరిగణలోకి తీసుకుంటాయి. మరియు ఇతర సంస్థలు(Institutes) వారి స్వంతంగా సపరేట్ గా ఎంట్రన్స్ ఎక్సామ్స్ కండక్ట్ చేసుకుంటాయి.
సంస్థలు/విశ్వవిద్యాలయాలు(Institutes/Universities):
ఇక్కడ భారతదేశంలో ఉన్న కొన్ని ముఖ్యమైన సంస్థలు(Institutes), విశ్వవిద్యాలయాలు(Universities) ల గురించి CBSE Manual లో తెలిపిన ప్రకారం వివరించడం జరిగింది. వివిధ రాష్ట్రాలలో ఉన్న విద్యాసంస్థలు, యూనివర్సిటీలలో కూడా పైన తెల్పిన కోర్సులు అందుబాటులో ఉండవచ్చు. విద్యార్ధులు తమ దగ్గరలో, అందుబాటులో ఉన్న విద్యాసంస్థలు, యూనివర్సిటీలలో మీరు ఎంపిక చేసుకున్న కోర్సులు ఉన్నాయో, లేవో తెలుసుకొని అడ్మిషన్ పొందగలరు.
- ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ(IIT) – ఖరగపూర్, వెస్ట్ బెంగాల్. (Indian Institute of Technology(IIT) – Kharagpur, West Bengal.)
- ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ(IIT) – రూర్కీ, ఉత్తరాఖండ్. (Indian Institute of Technology(IIT) – Roorkee, Uttarakhand.)
- ఆలిగర్ ముస్లిం యూనివర్సిటీ – ఆలిగర్, ఉత్తర ప్రదేశ్. (Aligarh Muslim University – Aligarh, Uttar Pradesh.)
- ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంజనీరింగ్ సైన్స్ అండ్ టెక్నాలజీ(IIEST) – షిబ్పూర్, హౌరా, వెస్ట్ బెంగాల్. (Indian Institute of Engineering Science and Technology (IIEST) – Shibpur, Howrah, West Bengal.)
- బిర్లా ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ – మేస్ర, రాంచి, జార్ఖండ్. (Birla Institute of Technology – Mesra, Ranchi, Jharkhand.)
- అన్న యూనివర్సిటీ – చెన్నై, తమిళనాడు. (Anna University – Chennai, Tamil Nadu.)
- సెంటర్ ఫర్ ఎన్విరాన్మెంటల్ ప్లానింగ్ అండ్ టెక్నాలజీ (CEPT) యూనివర్సిటీ – అహ్మదాబాద్, గుజరాత్. (Centre for Environmental Planning and Technology (CEPT) University – Ahmedabad, Gujarat.)
- ఛత్తీస్ ఘడ్ స్వామి వివేకానంద టెక్నికల్ యూనివర్సిటీ – ఛత్తీస్ ఘడ్. (Chhattisgarh Swami Vivekananda Technical University – Chhattisgarh.)
- స్కూల్ ఆఫ్ ప్లానింగ్ అండ్ ఆర్కిటెక్చర్ – న్యూ ఢిల్లీ. (School of Planning and Architecture – New Delhi.)
- నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (NIT) – పాట్నా, బీహార్. (National Institute of Technology – Patna, Bihar.)
- నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ, హామీర్పూర్, హిమాచల్ ప్రదేశ్. (National Institute of Technology – Hamirpur, Himachal Pradesh.)
- జామియా మిల్లియ ఇస్లామీయ యూనివర్సిటీ – న్యూ ఢిల్లీ. (Jamia Millia Islamia University – New Delhi.)
- జవహర్లాల్ నెహ్రూ టెక్నాలాజికల్ యూనివర్సిటీ హైదరాబాద్ – కూకట్ పల్లి, హైదరాబాద్, తెలంగాణ. (Jawaharlal Nehru Technological UniversityHyderabad –Kukatpally Hyderabad, Telangana.)
- డిపార్ట్మెంట్ ఆఫ్ ఆర్కిటెక్చర్ అండ్ ప్లానింగ్ ఇంజనీరింగ్ – మాధవ్ నగర్, నాగ్ పూర్, మహారాష్ట్ర. (Department of Architecture and Planning Engineering – Madhav Nagar, Nagpur, Maharashtra.)