ఇంటర్మీడియట్ తర్వాత ఏఏ కోర్సులు ఉన్నాయి??
ఏఏ కోర్సు చదివితే మంచి ఫ్యూచర్ ఉంటుంది.
ఏఏ కోర్సు చదివితే మంచి ఉద్యోగ అవకాశాలు ఉంటాయి.. అనే వాటి గురించిన మరింత సమాచారం మీకోసం.
What Next..?? After Intermediate Course..
ఇంటర్మీడియట్ పూర్తి అయినా తర్వాత చాలారకాల కోర్సులు అందుబాటులో ఉన్నాయి. విద్యార్ధులు జీవితంలో ఏమి అవ్వాలనుకుంటున్నారో నిర్ణయించుకొని కోర్సులను ఎంపిక చేసుకోవాల్సి ఉంటుంది. ఇంటర్మీడియట్ పూర్తి అయినా తర్వాత కొన్ని రకాల కోర్సులను చదవాలంటే వాటికి సంబంధించిన అర్హత పరీక్ష(Entrance Exams)లను రాయాల్సి ఉంటుంది. వాటి గురించిన సమాచారం మరియు ఇంటర్మీడియట్ తర్వాత అందుబాటులో ఉన్న కోర్సుల గురించిన సమాచారం..
ఇంటర్మీడియట్ పూర్తి అయినా తర్వాత విద్యార్థులు ముఖ్యంగా ఏఏ రంగం వైపు తమ కెరీర్ ను ఎంచుకోవాలో అలోచించి అడుగులు వేయాల్సి ఉంటుంది. వాటిలో ముఖ్యమైనవి.
- ఇంజనీరింగ్ (Engineering)
- మెడిసిన్ (Medicine)
- డిగ్రీ (Degree)
- టీచింగ్ (Teaching)
- డిప్లొమా కోర్సులు (Diploma Courses)
ఇంజనీరింగ్ (Engineering) :
ఇంటర్మీడియట్ MPC గ్రూపులో ఉత్తిర్ణత సాధించిన వారు మాత్రమే ఇంజనీరింగ్ చేయడానికి అర్హులు అవుతారు.
ఇంజనీరింగ్ కోర్సు యొక్క డ్యూరేషన్ 4 సంవత్సరాలు ఉంటుంది.
ఇంజనీరింగ్ లో B.E / B.Tech చేయాలనుకునేవారు సంబంధిత యూనివర్సిటీ వారు నిర్వహించే అర్హత పరీక్షలను (Entrance Exams) రాయాల్సి ఉంటుంది. ఉదా: తెలంగాణ రాష్ట్రం లో నిర్వహించే TGEAPCET ఎంట్రన్స్ టెస్ట్. ఇందులో క్వాలిఫై అయినవారు మాత్రమే ఇంజనీరింగ్ చేయడానికి అవకాశం ఉంటుంది.
ఎంట్రన్స్ పరీక్షలు (Entrance Tests) :
ఇంజనీరింగ్ లో చేరాలనుకునే వారికి దేశవ్యాప్తంగా ఉన్న వివిధ రకాల ఎంట్రన్స్ టెస్టులు, వాటి వివరాలు
- JEE Mains (IIIT, NIT లలో ఇంజనీరింగ్ ప్రవేశాల కోసం)
- JEE Advanced (IIT లలో ఇంజనీరింగ్ ప్రవేశాల కోసం)
- BITSAT (BITS PILANI లలో ఇంజనీరింగ్ ప్రవేశాల కోసం)
- TGEAPCET (తెలంగాణ రాష్ట్రంలో ఇంజనీరింగ్ కాలేజీలలో ప్రవేశాల కోసం)
- APEAPCET (ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇంజనీరింగ్ కాలేజీలలో ప్రవేశాల కోసం)
ఇంజనీరింగ్ లో ఉన్న కోర్సులు :
ఎంట్రన్స్ పరీక్షలో అర్హత సాధించిన తర్వాత విద్యార్థులు తమ కెరీర్ కు అనుగుణంగా కోర్సును ఎంచుకోవాల్సి ఉంటుంది.
ఇంజనీరింగ్ లో వివిధ రకాల కోర్సులు అందుబాటులో ఉన్నాయి అవి.
- కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్ (Computer Science Engineering (CSE))
- ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ (Information Technology (IT))
- ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్ (Electronics and Communication Engineering (ECE))
- ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్ (Electrical and Electronics Engineering (EEE))
- సివిల్ ఇంజనీరింగ్ (Civil Engineering)
- మెకానికల్ ఇంజనీరింగ్ (Mechanical Engineering)
- కెమికల్ ఇంజనీరింగ్ (Chemical Engineering)
- ఏరోనాటికల్ ఇంజనీరింగ్ (Aeronautical Engineering)
- ఏరోస్పేస్ ఇంజనీరింగ్ (Aerospace Engineering)
- అగ్రికల్చరల్ ఇంజనీరింగ్ (Agricultural Engineering)
- ఆటోమొబైల్ ఇంజనీరింగ్ (Automobile Engineering)
- బయోమెడికల్ ఇంజనీరింగ్ (Bio-Medical Engineering)
- బయోటెక్నాలజీ ఇంజనీరింగ్ (Bio-Technology Engineering)
- సిరామిక్ ఇంజనీరింగ్ (Ceramic Engineering)
- ఇండస్ట్రియల్ ఇంజనీరింగ్ (Industrial Engineering)
- ఎన్విరాన్మెంట్ ఇంజనీరింగ్ (Environment Engineering)
- మరైన్ ఇంజనీరింగ్ (Marine Engineering)
- మైనింగ్ ఇంజనీరింగ్ (Mining Engineering)
- సిల్క్ &టెక్స్ట్ టైల్ ఇంజనీరింగ్ (Silk & Textile Engineering)
మెడిసిన్ (Medicine) :
ఇంటర్మీడియట్ BiPC గ్రూపులో ఉత్తిర్ణత సాధించిన వారు మాత్రమే మెడిసిన్ కి సంబంధించిన కోర్సులు చేయడానికి అర్హులు అవుతారు.
మెడిసిన్ కోర్సు యొక్క డ్యూరేషన్ 5 సంవత్సరాలు ఉంటుంది.
ఎంట్రన్స్ పరీక్షలు (Entrance Tests):
మెడిసిన్ చేయడానికి ఎంట్రన్స్ పరీక్షలు రాయవలసి ఉంటుంది. అవి
- TGEAPCET
- APEAPCET
- NEET
కోర్సుల వివరాలు (మెడిసిన్ లో)
- MBBS – Allopathic (అల్లోపతిక్)
- BUMS – Unani (ఉనాని)
- BHMS – Homeopathy (హొమియోపతి)
- BAMS – Ayurveda (ఆయుర్వేద)
- BNYS – Naturopathy (నాచురోపతి)
- BDS – Dental (డెంటల్)
- BVSc – Veterinary (వెటర్నరి)
- BPT – Physiotherapy (ఫిసియోథెరపీ)
- Ag.B.Sc – Agricultural (అగ్రికల్చరల్)
2 సంవత్సరాలు / 3 సంవత్సరాల కోర్సులు :
- B.Pharma (బ్యాచిలర్ ఆఫ్ ఫార్మసీ)
- B.Sc – Nursing (నర్సింగ్)
- BOT – Occupational Therapy (ఆక్యుపేషనల్ థెరపీ)
- BSc – Anaesthesia Technician (ఆనెస్తేసియ టెక్నిషియన్)
- BSc – Cardiac Technician (కార్డియాక్ టెక్నిషియన్)
- BSc – Radio Therapy Technician (రేడియో థెరపీ టెక్నిషియన్)
- BSc – Clinical Optometry (క్లినికల్ థెరపీ)
- BSc – Nuclear Medicine (న్యూక్లియర్ మెడిసిన్)
- BSc – Operation Theatre (ఆపరేషన్ థెరపీ)
- BSc – Physician Assistant (ఫిజిషియన్ అసిస్టెంట్)
- BSc – Respiratory Care (రెసిపిరేటరీ కేర్)
- BMLT – Medical Lab Technology (మెడికల్ ల్యాబ్ టెక్నాలజీ)
పారామెడికల్ కోర్సులు (Paramedical Courses) :
- Dialysis Technician (డయాలసిస్ టెక్నిషియన్)
- X-Ray Technician (ఎక్స్-రే టెక్నిషియన్)
- ECG Technician (ECG టెక్నిషియన్)
- Operation Theatre Technician (ఆపరేషన్ థియేటర్ టెక్నిషియన్)
డిగ్రీ (Degree) :
ఇంటర్మీడియట్ పూర్తి చేసిన తర్వాత విద్యార్థులు సాంప్రదాయ కోర్సులు అయినా డిగ్రీ లో ఉన్న వివిధ రకాల కోర్సులను కూడా తమ కెరీర్ కు అనుగుణంగా ఎంచుకోవచ్చు.
విద్యార్థులు ఈ డిగ్రీ పట్టా సంపాదించడం వలన భవిష్యత్తులో ఉన్నత విద్యను అభ్యసించవచ్చు లేదా ఏదయినా ఉద్యోగం చేయాలన్నా, కాంపిటేటివ్ పరీక్షలు రాయాలన్న ఈ డిగ్రీ పట్టా అవసరమవుతుంది.
కోర్సుల వివరాలు (డిగ్రీలో) :
డిగ్రీలో ఉన్న వివిధ రకాల బ్రాంచులు మరియు కోర్సుల వివరాలను ఒకసారి పరిశీలిద్దాం.
డిగ్రీలో ముఖ్యంగా 3 రకాల బ్రాంచులు అందుబాటులో ఉన్నాయి అవి.
- B.A (బి.ఎ)
- B.Com (బి.కాం)
- B.Sc. (బి.ఎస్సీ)
B.A (బి.ఎ) :
- HEP
- HTP
- Linguistics (లింగ్విస్టిక్)
- Economics (ఎకనామిక్స్)
- Psychology (సైకాలజీ)
- Fine Arts (ఫైన్ ఆర్ట్స్)
- Political Science (పొలిటికల్ సైన్స్)
- Sociology (సోషియాలజీ)
- Library Science (లైబ్రరి సైన్స్)
B.Com (బి.కాం) :
- Regular (రెగ్యులర్)
- Computers (కంప్యూటర్స్)
- Bank Management (బ్యాంక్ మేనేజ్మెంట్)
- Tax Procedure & Practice (టాక్స్ ప్రొసీజర్ & ప్రాక్టీస్)
B.Sc. (బి.ఎస్సీ) :
- MPC
- MPCs
- MSCs
- MCCs
- MEC
- BZC/CBZ
- Horticulture (హార్టీకల్చర్)
- Computer Science (కంప్యూటర్ సైన్స్)
- Home Science (హోమ్ సైన్స్)
- Bio-Chemistry (బయో కెమిస్ట్రీ)
- Micro Biology (మైక్రో బయాలజీ)
- Anthropology (ఆంత్రోపాలజి)
- Dairy Science (డైరీ సైన్స్)
ఇతర డిగ్రీ కోర్సులు (Other Degree Courses) :
ఈ కింది చూపించిన కోర్సులు కొన్ని కాలేజీలలో మాత్రమే అందుబాటులో ఉంటాయి. ఒకవేళ డిగ్రీ లో ఇటువంటి కోర్సులు చదవాలనుకుంటే వాటికి సంబందించిన కాలేజీలలో చదవాల్సి ఉంటుంది.
- LLB (Bachelor of Law) (బ్యాచిలర్ ఆఫ్ లా)
- BBA (Bachelor of Business of Administration) (బ్యాచిలర్ ఆఫ్ బిజినెస్ అడ్మినిస్ట్రేషన్)
- BBM (Bachelor of Business Management) (బ్యాచిలర్ ఆఫ్ బిజినెస్ మేనేజ్మెంట్ )
- BAF (Bachelor of Accounting and Finance) (బ్యాచిలర్ ఆఫ్ అకౌంటింగ్ అండ్ ఫైనాన్స్)
- BFM (Bachelor of Financial Markets) (బ్యాచిలర్ ఆఫ్ ఫైనాన్షియల్ మార్కెట్స్)
- BMS (Business Management System) (బిజినెస్ మేనేజ్మెంట్ సిస్టమ్)
టీచింగ్ (Teaching) :
ఇంటర్మీడియట్ పూర్తి చేసిన తర్వాత ఎవరికైతే టీచింగ్ మీద ఇంట్రెస్ట్ ఉంటుందో అటువంటి వారు టీచింగ్ కి సంబంధించిన రంగాన్ని ఎంచుకోవచ్చు.
టీచింగ్ కి సంబంధించి వివిధ రకాల బ్రాంచులు అందుబాటులో ఉన్నాయి అవి :
- D.Ed (డిప్లొమా ఇన్ ఎడ్యుకేషన్)
- UDPED (అండర్ గ్రాడ్యూయేట్ డిప్లొమా ఇన్ ఫిజికల్ ఎడ్యుకేషన్)
- ECCED (ఎర్లీ చైల్డ్ హుడ్ కేర్ అండ్ ఎడ్యుకేషన్)
D.Ed (డిప్లొమా ఇన్ ఎడ్యుకేషన్)
- D.Ed (డిప్లొమా ఇన్ ఎడ్యుకేషన్) అనేది ప్రైమరీ స్కూల్ టీచర్ అంటే 1వ తరగతి నుండి 5వ తరగతి వరకు టీచింగ్ చేయాలనుకునే వారు ఈ కోర్సును ఎంచుకోవచ్చు.
- ఈ కోర్సు యొక్క డ్యూరేషన్ 2 సంవత్సరాలు ఉంటుంది.
- ఈ కోర్సు చేయాలనుకునేవారు DEE-CET అనే ఎంట్రన్స్ ఎగ్జామ్ రాయాల్సి ఉంటుంది.
UDPED (అండర్ గ్రాడ్యూయేట్ డిప్లొమా ఇన్ ఫిజికల్ ఎడ్యుకేషన్) :
- U.D.P.Ed (అండర్ గ్రాడ్యూయేట్ డిప్లొమా ఇన్ ఫిజికల్ ఎడ్యుకేషన్) అంటే ఎవరైతే PET టీచర్ కావాలనుకుంటున్నారో వారు ఈ కోర్సును ఎంపిక చేసుకోవచ్చు.
- ఈ కోర్సు యొక్క డ్యూరేషన్ 2 సంవత్సరాలు ఉంటుంది.
- ఈ కోర్సు చేయాలనుకునేవారు PECET అనే ఎంట్రన్స్ ఎగ్జామ్ రాయాల్సి ఉంటుంది.
ECCED (ఎర్లీ చైల్డ్ హుడ్ కేర్ అండ్ ఎడ్యుకేషన్) :
- ECCED (ఎర్లీ చైల్డ్ హుడ్ కేర్ అండ్ ఎడ్యుకేషన్) చిన్న పిల్లల కేర్ టేకింగ్ కి సంబంధించి ఇంట్రెస్ట్ ఉన్నవారు ఈ కోర్సు ను ఎంచుకోవచ్చు.
- ఈ కోర్సు యొక్క డ్యూరేషన్ 2 సంవత్సరాలు ఉంటుంది.
డిప్లొమా కోర్సులు (Diploma Courses) :
ఇంటర్మీడియట్ పూర్తి చేసిన తర్వాత విద్యార్థులు కొన్ని రకాల డిప్లొమా కోర్సులలో చేరవచ్చు అవి
ఇంటర్ (MPC) వారికి :
- డిప్లొమా ఇన్ ప్రొస్తెటిక్స్ & ఆర్థోటిక్స్ (Diploma in Prosthetics & Orthotics)
- డిప్లొమా ఇన్ ఆప్టోమెట్రి (Diploma in Optometry)
- డిప్లొమా ఇన్ కంప్యూటర్ స్కిల్స్ (Diploma in Computer Skills)
- డిప్లొమా ఇన్ ఇంటీరియర్ డిజైన్ (Diploma in Interior Design)
ఇంటర్ (BIPC) వారికి :
- డిప్లొమా ఇన్ మెడికల్ రికార్డు టెక్నాలజీ (Diploma in Medical Record Technology)
- డిప్లొమా ఇన్ సానిటరీ ఇన్స్పెక్టర్ (Diploma in Sanitary Inspector)
- డిప్లొమా ఇన్ యాక్ససరి డిజైన్ (Diploma in Accessory Design)
- డిప్లొమా ఇన్ ఫ్యాషన్ అండ్ వెబ్ డిజైన్ (Diploma in Fashion and Web Design)
- అడ్వాన్స్డ్ డిప్లొమా ప్రోగ్రాం ఇన్ ఫ్యాషన్ డిజైన్ అండ్ టెక్స్ట్ టైల్ డిజైన్ (Advanced Diploma Program in Fashion Design and Textile Design)
- డిప్లొమాస్ ఇన్ లెదర్ గూడ్స్ టెక్నాలజీ (Diplomas in Leather Goods Technology)
- డిప్లొమా ఇన్ ఫుట్ వేర్ టెక్నాలజీ (Diploma in Foot Ware Technology)
- డిప్లొమా ఇన్ మెడికల్ రేడియాలజి (Diploma in Medical Radiology)
- డిప్లొమాస్ ఇన్ పారామెడికల్ ఫీల్డ్స్ (Diplomas in Paramedical Fields)
ఇంటర్ (అన్నిగ్రూపుల) వారికి :
- డిప్లొమా ఇన్ ఫిల్మ్ ఎడిటింగ్ (Diploma in Film Editing)
- డిప్లొమా ఇన్ ట్రావెల్ అండ్ టూరిజం అండ్ మేనేజ్మెంట్ (Diploma in Travel and Tourism and Management)
- డిప్లొమా ఇన్ హోటల్ మేనేజ్మెంట్ (Diploma in Hotel Management)
- డిప్లొమా ఇన్ ఫైర్ అండ్ సేఫ్టీ ఇంజనీరింగ్ (Diploma in Fire and Safety Engineering)
- డిప్లొమా ఇన్ అకౌంటెన్సీ అండ్ ఫైనాన్స్ (Diploma in Accountancy and Finance)