Aerospace Engineering Course Details in Telugu

Share this article with your friends

ఇంటర్మీడియట్ పూర్తి చేసిన తర్వాత విద్యార్థులు తమ జీవితంలో మెరుగైన చదువుల కోసం ఏ కోర్సును ఎంచుకోవాలో తెలియక ఒత్తిడికి గురవుతుంటారు. అటువంటి విద్యార్థుల కోసం, CBSE (సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్) ద్వారా గుర్తించబడిన 113 రకాల కోర్సులకు సంబంధించి ప్రతి ఒక్కటి వివరించబడింది. దీని ద్వారా, విద్యార్థులు ఆ కోర్సులకు సంబంధించి పూర్తి వివరాలు తెలుసుకోవచ్చు మరియు వారికీ ఇష్టమైన కోర్సును ఎంచుకొని జీవితంలో మెరుగైన స్థాయిలో స్థిరపడవచ్చు. CBSE ద్వారా గుర్తించబడిన 113 రకాల కోర్సులలో ఏరోస్పేస్ ఇంజనీరింగ్ (Aerospace Engineering) గురించి పూర్తి వివరణ.

ఏరోస్పేస్ ఇంజనీరింగ్ (Aerospace Engineering)

పరిచయం(Introduction):

ఏరోస్పేస్ ఇంజనీరింగ్ అనేది పరిశోధన, రూపకల్పన, అభివృద్ది, నిర్మాణం, విమాన మరియు అంతరిక్ష నౌకల పరీక్షలతో వ్యహరించే ఇంజనీరింగ్ శాఖ. ఇది రెండు ప్రధానమైన మరియు విస్తరించే శాఖలుగా విభజించబడినది. భూమి యొక్క వాతావరణంలోని విమానాలకు సంబంధించిన ఏరోనాటికల్ ఇంజనీరింగ్ మరియు భూమి యొక్క వాతావరణం వెలుపల పనిచేసే అంతరిక్ష నౌకలతో వ్యవహరించే ఆస్ట్రోనాటికల్ ఇంజనీరింగ్.

Read Also..  Civil Engineering Course Details in Telugu
కోర్సుల వివరాలు:
  1. B.Tech డిగ్రీ (B.Tech Degree)
  2. డ్యుయల్ డిగ్రీ (కాంబినేషన్ ఆఫ్ బ్యాచిలర్ అండ్ మాస్టర్ డిగ్రీ)
  3. M.Tech డిగ్రీ (స్పెషలైజేషన్ కోర్సులు) (M.Tech Degree with Specialization Courses
  4. Ph.D. ప్రోగ్రాములు (Ph.D. Programs)
అర్హతలు(Eligibility):

అండర్ గ్రాడ్యూయేట్ లెవెల్:

ఫిజిక్స్, కెమిస్ట్రీ మరియు మ్యాథమెటిక్స్ లేదా తత్సమాన పరీక్షలో 10+2 లో ఉత్తీర్ణత. (IIT లు JEE స్కోర్ ను పరిగణలోకి తీసుకుంటాయి. మరియు ఇతర సంస్థలు వారి స్వంత ప్రత్యేక ప్రవేశ పరీక్షలను కలిగి ఉంటాయి.)

పోస్ట్ గ్రాడ్యూయేట్ లెవెల్:

ఏరోనాటికల్/ ఏరోస్పేస్ లేదా సంబంధిత ఇంజనీరింగ్ లో అండర్ గ్రాడ్యూయేట్ డిగ్రీ, లేదా రెండు విభాగాలలో ఉత్తీర్ణత సాధించి ఉండాలి.

డాక్టరల్ లెవెల్:  

తప్పనిసరిగా ఏరోనాటికల్/ఏరోస్పేస్ ఇంజనీరింగ్ లో పోస్ట్ గ్రాడ్యుయేషన్ పూర్తి చేసి ఉండాలి. మరియు తప్పనిసరిగా వాలిడ్ అయిన GATE స్కోర్ ను కలిగి ఉండాలి.

Read Also..  List of ITI Trades/Courses Affiliated to NCVT
సంస్థలు/విశ్వవిద్యాలయాలు(Institutes/Universities):

ఇక్కడ భారతదేశంలోని కొన్ని కీలకమైన విద్యా సంస్థలు (Educational Institutes) మరియు విశ్వవిద్యాలయాలు(Universities) ల గురించి CBSE Manual లో తెలిపిన ప్రకారం తెలియజేయబడ్డాయి. పైన పేర్కొన్న కోర్సులు వివిధ రాష్ట్రాల్లోని విద్యా సంస్థలు మరియు విశ్వవిద్యాలయాలలో కూడా అందుబాటులో ఉంటాయి. విద్యార్థులు, తమకు నచ్చిన కోర్సులు అందుబాటులో ఉన్నాయో లేదో తెలుసుకోవడం ద్వారా అడ్మిషన్ పొందవచ్చు లేదా మీకు దగ్గరగా లేదా అందుబాటులో ఉన్న ఇన్‌స్టిట్యూట్‌లు (Institutes) మరియు విశ్వవిద్యాలయాలు (Universities) లలో మీరు ఎంపిక చేసుకున్న కోర్సులు ఉన్నాయో, లేవో తెలుసుకొని అడ్మిషన్ పొందగలరు.

  1. ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ(IIT), ఖరగపూర్.
  2. ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ, ముంబై.
  3. ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ, చెన్నై.
  4. ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ, మద్రాసు.
  5. పంజాబ్ ఇంజనీరింగ్ కాలేజీ (deemed to be University), చండీగఢ్.
  6. ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంజనీరింగ్ సైన్స్ అండ్ టెక్నాలజీ(IIEST), షిబ్పూర్, వెస్ట్ బెంగాల్.
Read Also..  ITI Course Details in Telugu

Share this article with your friends