Biotechnology Engineering Course Details in Telugu

Share this article with your friends

ఇంటర్మీడియట్ పూర్తి చేసిన తర్వాత విద్యార్ధులు తమ కెరీర్ లో ఉన్నత చదువుల కోసం ఏ కోర్సును ఎంపిక చేసుకోవాలో తెలియక తర్జనభర్జన పడుతుంటారు. అటువంటి వారికోసం CBSE (Central Board of Secondary Education) చే గుర్తించబడిన 113 రకాల కోర్సులలో ఒక్కొక్క కోర్సు గురించి వివరించడం జరిగింది. దీని ద్వారా విద్యార్ధులు  ఏ రంగంలో ఎటువంటి కోర్సులు ఉన్నాయో తెలుసుకొని, తమకు నచ్చిన రంగంలో కోర్సును ఎంపిక చేసుకొని జీవితంలో ఉన్నత స్థాయిలో స్థిరపడవచ్చు.  అందులో బాగంగా CBSE చే గుర్తించబడిన 113 రకాల కోర్సులలో బయోటెక్నాలజీ ఇంజనీరింగ్ (Biotechnology Engineering) కోర్సు గురించి వివరణ.

బయోటెక్నాలజీ ఇంజనీరింగ్ (Biotechnology Engineering)

పరిచయం(Introduction):

బయోటెక్నాలజీ ఇంజనీరింగ్ అనేది ఇంజనీరింగ్ యొక్క ఒక శాఖ, ఇక్కడ సాంకేతిక పరిశోధన మరియు అభివృద్ధి కోసం జీవశాస్త్రంతో కలిపి ఉంటుంది.

బయోటెక్నాలజీలో ఇంజనీరింగ్, జెనీటిక్స్, మైక్రోబయాలజీ మరియు కెమిస్ట్రీ వంటి విస్తృత శ్రేణి సబ్జెక్టులు ఉంటాయి. జీవరసాయన శాస్త్రం, పశుపోషణ, వ్యాక్సిన్లు మరియు ఔషధాల పెరుగుదల, వ్యవసాయం, కాలుష్య నియంత్రణ , శక్తి ఉత్పత్తి మరియు పరిరక్షణ, దీర్ఘకాలిక వ్యాధులను నయం చేయడం మరియు పర్యావరణ పరిరక్షణ వంటి రంగాలలో బయోటెక్నాలజీ యొక్క వివిధ అనువర్తనాలు ఉన్నాయి. అవి:

  • జెనె థెరపీ (Gene Therapy)
  • టిష్యూ కల్చర్ (Tissue Culture)
  • ఇమ్యూన్ టెక్నాలజీస్ (Immune Technologies)
  • జెనెటిక్ ఇంజనీరింగ్ (Genetic Engineering)
  • డ్రగ్ డిజైన్ (Drug Design)
  • స్టెమ్ సెల్ టెక్నిక్స్ (Stem Cell Techniques)
  • న్యూ DNA టెక్నాలజీస్ (New DNA Technologies)
  • ఫోటోసింథటిక్ ఏఫీషియన్సీ (Photosynthetic Efficiency)
  • ఏంజైమ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ (Enzyme Engineering and Technology)
Read Also..  Courses after Intermediate in Telugu
కోర్సుల వివరాలు:
  1. డిప్లమా ఇన్ బయోటెక్నాలజీ ఇంజనీరింగ్ (Diploma in Biotechnology Engineering)
  2. బ్యాచిలర్ ఆఫ్ ఇంజనీరింగ్ ఇన్ బయోటెక్నాలజీ (Bachelor of Engineering in Biotechnology)
  3. బ్యాచిలర్ ఆఫ్ టెక్నాలజీ ఇన్ బయోప్రాసెస్ టెక్నాలజీ (Bachelor of Technology in Bioprocess Technology)
  4. బ్యాచిలర్ ఆఫ్ టెక్నాలజీ ఇన్ బయోటెక్నాలజీ అండ్ బయోకెమికల్ ఇంజనీరింగ్ (Bachelor of Technology in Biotechnology and Biochemical Engineering)
  5. బ్యాచిలర్ ఆఫ్ టెక్నాలజీ ఇన్ బయోటెక్నాలజీ (Bachelor of Technology in Biotechnology)
  6. మాస్టర్ ఆఫ్ ఇంజనీరింగ్ ఇన్ బయోటెక్నాలజీ (Master of Engineering in Biotechnology)
  7. మాస్టర్ ఆఫ్ టెక్నాలజీ ఇన్ బయోటెక్నాలజీ (Master of Technology in Biotechnology)
అర్హతలు(Eligibility):

బయాలజీ, కెమిస్ట్రీ మరియు మ్యాథమెటిక్స్ లో 10+2 లో ఉత్తీర్ణత. (IIT కొరకు  జాయింట్ ఎంట్రన్స్ ఎక్సామ్ (JEE) తప్పనిసరిగా క్వాలిఫై అవ్వాల్సి ఉంటుంది. ఈ కోర్సు యొక్క డ్యూరేషన్ 4 సంవత్సరాలు ఉంటుంది.)

Read Also..  Automobile Engineering Course Details in Telugu
సంస్థలు/విశ్వవిద్యాలయాలు(Institutes/Universities):

ఇక్కడ భారతదేశంలో ఉన్న కొన్ని ముఖ్యమైన సంస్థలు(Institutes), విశ్వవిద్యాలయాలు(Universities) ల గురించి CBSE Manual లో తెలిపిన ప్రకారం వివరించడం జరిగింది. వివిధ రాష్ట్రాలలో ఉన్న విద్యాసంస్థలు, యూనివర్సిటీలలో కూడా పైన తెల్పిన కోర్సులు అందుబాటులో ఉండవచ్చు. విద్యార్ధులు తమ దగ్గరలో, అందుబాటులో ఉన్న  విద్యాసంస్థలు, యూనివర్సిటీలలో మీరు ఎంపిక చేసుకున్న కోర్సులు ఉన్నాయో, లేవో తెలుసుకొని అడ్మిషన్ పొందగలరు.

  1. IITs (Indian Institute of Technologies)
  2. ఆరుపడై వీడు ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (AVIT) – చెన్నై, తమిళనాడు, ఇండియా. (Aarupadai Veedu Institute of Technology (AVIT) – Chennai, Tamil Nadu, India.)
  3. ఆచార్య నాగార్జున యూనివర్సిటీ(ANU), గుంటూర్, ఆంధ్ర ప్రదేశ్. ఇండియా. (Acharya Nagarjuna University (ANU), Guntur, Andhra Pradesh, India.)
  4. అలగప్పా యూనివర్సిటీ – కారైకుడి, తమిళనాడు, ఇండియా. ( Alagappa University – Karaikudi, Tamil Nadu, India.)
Read Also..  Instrumentation Engineering Course Details in Telugu

Share this article with your friends