Artificial Intelligence & Machine Learning Course Details In Telugu

Share this article with your friends

ఇంటర్మీడియట్ పూర్తి చేసిన తర్వాత విద్యార్ధులు తమ కెరీర్ లో ఉన్నత చదువుల కోసం ఏ కోర్సును ఎంపిక చేసుకోవాలో తెలియక తర్జనభర్జన పడుతుంటారు. అటువంటి వారికోసం CBSE (Central Board of Secondary Education) చే గుర్తించబడిన 113 రకాల కోర్సులలో ఒక్కొక్క కోర్సు గురించి వివరించడం జరిగింది. దీని ద్వారా విద్యార్ధులు  ఏ రంగంలో ఎటువంటి కోర్సులు ఉన్నాయో తెలుసుకొని, తమకు నచ్చిన రంగంలో కోర్సును ఎంపిక చేసుకొని జీవితంలో ఉన్నత స్థాయిలో స్థిరపడవచ్చు.   అందులో బాగంగా CBSE చే గుర్తించబడిన 113 రకాల కోర్సులలో ఆర్టిఫీషియల్ ఇంటెలిజన్స్ అండ్ మెషిన్ లెర్నింగ్ (Artificial Intelligence and Machine Learning) కోర్సు గురించి వివరణ.

ఆర్టిఫీషియల్ ఇంటెలిజన్స్ అండ్ మెషిన్ లెర్నింగ్ (Artificial Intelligence and Machine Learning)

పరిచయం(Introduction):

ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ అనేది సైన్స్ మరియు ఇంజనీరింగ్ రంగానికి చెందినది, దీనిలో అధ్యయనాలు మరియు పరిశోధనలు మానవ మేధస్సుతో పనులు చేయగల తెలివైన కంప్యూటర్ మెషిన్ లను అభివృద్ధి చేయడం లక్ష్యంగా పెట్టుకున్నాయి.

Read Also..  Polytechnic Diploma Course Details in Telugu

ఇది స్పీచ్ రికగ్నిషన్, విజువల్ పర్సేప్షన్, లాజిక్ అండ్ డెసిషన్, బహుళ-బాషా అనువాదం మరియు మరిన్నిటిని కలిగి ఉంటుంది. రోబోటిక్స్, ఆటోమేషన్, మరియు అదునాతన కంప్యూటర్ సాఫ్ట్వేర్ మరియు ప్రోగ్రామ్ ల  సహాయం/సహాయంతో డిజిటల్ బిట్స్ డాటా అన్వయించబడుతుంది.  మరియు ముఖ్యమైన అనుభవాలు మరియు ఫలితాలుగా మార్చబడుతుంది.

కోర్సుల వివరాలు:
  1. మెషిన్ లెర్నింగ్(ఇంటర్మీడియట్ లెవెల్)-ప్రీరిక్వైసిటీస్ ప్రాబబిలిటీ అండ్ స్టాటిస్టిక్స్ (or equivalent course). some background in లీనియర్ ఆల్జీబ్రా అండ్ ఆప్టిమైజేషన్. (IISc బెంగళూరు)
  2. అడ్వాన్స్డ్ సర్టిఫికేషన్ ఇన్ ఆర్టిఫీషియల్ ఇంటెలిజన్స్ & మెషిన్ లెర్నింగ్ (From IIIT-H)
  3. B.Tech కంప్యూటర్ సైన్స్ & ఇంజనీరింగ్ విత్ స్పెషలైజేషన్ ఇన్ AI & మెషిన్ లెర్నింగ్.
  4. B.Tech CS లేదా IT/ECE/ME/IN లేదా M.Sc. Degree in CS/IT గ్రాఫిక్ డిజైన్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, హెల్త్ ఇన్ఫర్మేటిక్స్ or equivalent
Read Also..  Biotechnology Engineering Course Details in Telugu
అర్హతలు(Eligibility):
  • సైన్స్ స్ట్రీమ్ లో 10+2 స్థాయి అర్హత ఉండాలి.
  • B.Tech తర్వాత M.Tech (CS/AI/IT, IC టెక్నాలజీ అండ్ బయోఇన్ఫర్మేటిక్స్) కోసం వాలిడ్ అయ్యే GATE స్కోర్ అవసరం.
సంస్థలు/విశ్వవిద్యాలయాలు(Institutes/Universities):

ఇక్కడ భారతదేశంలో ఉన్న కొన్ని ముఖ్యమైన సంస్థలు(Institutes), విశ్వవిద్యాలయాలు(Universities) ల గురించి తెలపడం జరిగింది. వివిధ రాష్ట్రాలలో ఉన్న విద్యాసంస్థలు,యూనివర్సిటీలలో కూడా పైన తెల్పిన కోర్సులు అందుబాటులో ఉండవచ్చు. విద్యార్ధులు తమ దగ్గరలో, అందుబాటులో ఉన్న  విద్యాసంస్థలు, యూనివర్సిటీలలో మీరు ఎంపిక చేసుకున్న కోర్సులు ఉన్నాయో, లేవో తెలుసుకొని అడ్మిషన్ పొందగలరు.

  1. IISc – బెంగళూరు, కర్ణాటక. (Indian Institute of Science – Bengaluru, Karnataka)
  2. IIT – బాంబే, ముంబై, మహారాష్ట్ర. (Indian Institute of Technology – Bombay, Mumbai, Maharashtra)
  3. IIT – ఖరగ్ పూర్, వెస్ట్ బెంగాల్. (Indian Institute of Technology – Kharagpur, West Bengal)
  4. IIIT – హైదరాబాద్, తెలంగాణ. (International Institute of Information Technology – Hyderabad, Telangana)
  5. IIIT – అలహాబాద్, ఉత్తర్ ప్రదేశ్. (Indian Institute of Information Technology – Allahabad, Uttar Pradesh)
  6. IIT – మద్రాస్, చెన్నై, తమిళనాడు. (Indian Institute of Technology – Madras, Chennai, Tamil Nadu)
  7. యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్ – హైదరాబాద్, తెలంగాణ. (University of Hyderabad – Hyderabad, Telangana)
Read Also..  ITI Course Details in Telugu

Share this article with your friends