Automobile Engineering Course Details in Telugu

Share this Article with Ur Frnds..

ఇంటర్మీడియట్ పూర్తి చేసిన తర్వాత విద్యార్ధులు తమ కెరీర్ లో ఉన్నత చదువుల కోసం ఏ కోర్సును ఎంపిక చేసుకోవాలో తెలియక తర్జనభర్జన పడుతుంటారు. అటువంటి వారికోసం CBSE (Central Board of Secondary Education) చే గుర్తించబడిన 113 రకాల కోర్సులలో ఒక్కొక్క కోర్సు గురించి వివరించడం జరిగింది. దీని ద్వారా విద్యార్ధులు  ఏ రంగంలో ఎటువంటి కోర్సులు ఉన్నాయో తెలుసుకొని, తమకు నచ్చిన రంగంలో కోర్సును ఎంపిక చేసుకొని జీవితంలో ఉన్నత స్థాయిలో స్థిరపడవచ్చు.  అందులో బాగంగా CBSE చే గుర్తించబడిన 113 రకాల కోర్సులలో ఆటోమొబైల్ ఇంజనీరింగ్ (Automobile Engineering) కోర్సు గురించి వివరణ.

ఆటోమొబైల్ ఇంజనీరింగ్ (Automobile Engineering)

పరిచయం(Introduction):

మెకానికల్, ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్, సాఫ్ట్ వేర్ మరియు సేఫ్టీ ఇంజనీరింగ్ వంటి ఇంజనీరింగ్ లోని వివిధ అంశాలను చేర్చడం ద్వారా కాన్సెప్ట్ దశ నుండి ఉత్పత్తి దశ వరకు వాహనాలు లేదా వాహన భాగాలను డిజైన్ చేయడం, అభివృద్ది చేయడం, రూపొందించడం మరియు పరీక్షించడం ఆటోమోటివ్ యొక్క అధ్యయనం.

Read Also..  ITI Course Details in India – Eligibility, Trades & Career Guide
కోర్సుల వివరాలు:
  1. B.Tech ఇన్ ఆటోమొబైల్ ఇంజనీరింగ్ (B.Tech in Automobile Engineering)
  2. డ్యుయల్ కోర్సెస్ (Dual Courses)
  3. M.Tech ఇన్ ఆటోమొబైల్ ఇంజనీరింగ్ (M.Tech in Automobile Engineering)
అర్హతలు(Eligibility):

ఇంజనీరింగ్ పోటీ పరీక్షలో అర్హత సాధించడానికి B.Tech/B.E కోర్సులకు సైన్స్ తోపాటు 10+2 నిర్దేశించిన విధంగా సైన్స్ సబ్జెక్టులలో మార్కుల శాతం అవసరం.

సంస్థలు/విశ్వవిద్యాలయాలు(Institutes/Universities):

ఇక్కడ భారతదేశంలో ఉన్న కొన్ని ముఖ్యమైన సంస్థలు(Institutes), విశ్వవిద్యాలయాలు(Universities) ల గురించి CBSE Manual లో తెలిపిన ప్రకారం వివరించడం జరిగింది. వివిధ రాష్ట్రాలలో ఉన్న విద్యాసంస్థలు, యూనివర్సిటీలలో కూడా పైన తెల్పిన కోర్సులు అందుబాటులో ఉండవచ్చు. విద్యార్ధులు తమ దగ్గరలో, అందుబాటులో ఉన్న  విద్యాసంస్థలు, యూనివర్సిటీలలో మీరు ఎంపిక చేసుకున్న కోర్సులు ఉన్నాయో, లేవో తెలుసుకొని అడ్మిషన్ పొందగలరు.

  1. యూనివర్సిటీ ఆఫ్ కాలికట్ – తేన్హిపాలెం, మళప్పురం, కేరళ. (University of Calicut, Thenhipalam, Malappuram, Kerala.)
  2. మౌలానా అబ్దుల్ కలాం ఆజాద్ యూనివర్సిటీ ఆఫ్ టెక్నాలజీ – హరిం ఘట, వెస్ట్ బెంగాల్. (Moulana Abdul Kalam Azad University of Technology – Haringhata, West Bengal.)
  3. రాజస్తాన్ టెక్నికల్ యూనివర్సిటీ- కోట, రాజస్తాన్. (Rajasthan Technical University – Kota, Rajasthan.)
Read Also..  Manufacturing Science and Engineering Course, Complete Guide

Share this Article with Ur Frnds..