Instrumentation Engineering Course Details in Telugu

Share this Article with Ur Frnds..

ఇంటర్మీడియట్ పూర్తి చేసిన తర్వాత విద్యార్ధులు తమ కెరీర్ లో ఉన్నత చదువుల కోసం ఏ కోర్సును ఎంపిక చేసుకోవాలో తెలియక తర్జనభర్జన పడుతుంటారు. అటువంటి వారికోసం CBSE (Central Board of Secondary Education) చే గుర్తించబడిన 113 రకాల కోర్సులలో ఒక్కొక్క కోర్సు గురించి వివరించడం జరిగింది. దీని ద్వారా విద్యార్ధులు  ఏ రంగంలో ఎటువంటి కోర్సులు ఉన్నాయో తెలుసుకొని, తమకు నచ్చిన రంగంలో కోర్సును ఎంపిక చేసుకొని జీవితంలో ఉన్నత స్థాయిలో స్థిరపడవచ్చు.  అందులో బాగంగా CBSE చే గుర్తించబడిన 113 రకాల కోర్సులలో ఇన్స్ట్రుమెంటేషన్ ఇంజనీరింగ్ (Instrumentation Engineering) కోర్సు గురించి వివరణ.

ఇన్స్ట్రుమెంటేషన్ ఇంజనీరింగ్ (Instrumentation Engineering)

పరిచయం (Introduction):

ఇన్స్ట్రుమెంటేషన్ ఇంజనీరింగ్ అనేది ఎలక్ట్రికల్ మరియు ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్ యొక్క ఒక శాఖ. ఇది ఆటోమేటెడ్ సిస్టమ్ ల రూపకల్పన మరియు అసెంబ్లింగ్ లో ఉపయోగించే కంప్యూటింగ్ సాధనాల ఇంజనీరింగ్ సూత్రాలు మరియు విధానాలను అధ్యయనం చేస్తుంది.

Read Also..  Medical Electronics Engineering Course: Complete Details
కోర్సుల వివరాలు (Course Details):
  1. B.E. / B.Tech
  2. M.E. / M.Tech
  3. M.Phil.
  4. Ph.D.
అర్హతలు (Eligibility):

ఫిజిక్స్, కెమిస్ట్రీ మరియు మ్యాథమెటిక్స్ కోర్ సబ్జెక్టులుగా 10+2 లో ఉత్తీర్ణత సాధించాలి. (విద్యార్ధులు B.Tech కోర్సులలో ప్రవేశాలకోసం తప్పనిసరిగా JEE(మెయిన్) & JEE (అడ్వాన్స్) వంటి ప్రవేశ పరీక్షల ద్వారా వెళ్ళాలి.)

సంస్థలు/విశ్వవిద్యాలయాలు (Institutes/Universities):

ఇక్కడ భారతదేశంలో ఉన్న కొన్ని ముఖ్యమైన సంస్థలు (Institutes), విశ్వవిద్యాలయాలు (Universities) ల గురించి CBSE Manual లో తెలిపిన ప్రకారం వివరించడం జరిగింది. వివిధ రాష్ట్రాలలో ఉన్న విద్యాసంస్థలు, యూనివర్సిటీలలో కూడా పైన తెల్పిన కోర్సులు అందుబాటులో ఉండవచ్చు. విద్యార్ధులు తమ దగ్గరలో, అందుబాటులో ఉన్న  విద్యాసంస్థలు, యూనివర్సిటీలలో మీరు ఎంపిక చేసుకున్న కోర్సులు ఉన్నాయో, లేవో తెలుసుకొని అడ్మిషన్ పొందగలరు.

  1. బెంగళూరు ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ, కర్ణాటక, ఇండియా. (Bengaluru Institute of Technology, Karnataka, India.)
  2. భారతి విద్యాపీఠ్ కాలేజీ ఆఫ్ ఇంజనీరింగ్, మహారాష్ట్ర, ఇండియా. (Bharathi Vidyapeeth College of Engineering, Maharashtra, India.)
  3. BMS కాలేజీ ఆఫ్ ఇంజనీరింగ్, కర్ణాటక, ఇండియా. (BMS College of Engineering, Karnataka, India.)
  4. దయానంద సాగర్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ, కర్ణాటక, ఇండియా. (Dayananda Sagar Institute of Technology, Karnataka, India.)
  5. MS రామయ్య ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ, కర్ణాటక, ఇండియా. (MS Ramaiah Institute of Technology, Karnataka, India.)
Read Also..  Electronics and Communication Engineering (ECE) Course Details

Share this Article with Ur Frnds..