ఇంటర్మీడియట్ పూర్తి చేసిన తర్వాత విద్యార్ధులు తమ కెరీర్ లో ఉన్నత చదువుల కోసం ఏ కోర్సును ఎంపిక చేసుకోవాలో తెలియక తర్జనభర్జన పడుతుంటారు. అటువంటి వారికోసం CBSE (Central Board of Secondary Education) చే గుర్తించబడిన 113 రకాల కోర్సులలో ఒక్కొక్క కోర్సు గురించి వివరించడం జరిగింది. దీని ద్వారా విద్యార్ధులు ఏ రంగంలో ఎటువంటి కోర్సులు ఉన్నాయో తెలుసుకొని, తమకు నచ్చిన రంగంలో కోర్సును ఎంపిక చేసుకొని జీవితంలో ఉన్నత స్థాయిలో స్థిరపడవచ్చు. అందులో బాగంగా CBSE చే గుర్తించబడిన 113 రకాల కోర్సులలో సిరామిక్స్ ఇంజనీరింగ్ (Ceramics Engineering) కోర్సు గురించి వివరణ.
సిరామిక్స్ ఇంజనీరింగ్ (Ceramics Engineering)
పరిచయం(Introduction):
సిరామిక్ ఇంజనీరింగ్ అనేది అకర్బన, నాన్-మెటాలిక్ పదార్థాల నుండి వస్తువులను సృష్టించే శాస్త్రం మరియు సాంకేతికత. సెరామిక్స్ వేడిని తట్టుకొగలవు కాబట్టి, మైనింగ్, ఏరోస్పేస్, మెడిసిన్, రిపైనరీ, ఫుడ్ అండ్ కెమికల్ ఇండస్ట్రీస్, ప్యాకేజింగ్ సైన్స్, ఎలక్ట్రానిక్స్, ఇండస్ట్రీయల్ అండ్ ట్రాన్స్మిషన్ ఎలక్ట్రిసిటీ మరియు గైడెడ్ లైట్ వేవ్ ట్రాన్స్మిషన్ తో సహ అనేక రకాల పరిశ్రమలలో వీటిని ఉపయోగిస్తారు.
కోర్సుల వివరాలు:
- B.Tech
- M.Tech
అర్హతలు(Eligibility):
బయాలజీ, కెమిస్ట్రీ మరియు మ్యాథమెటిక్స్ లో 10+2 లో ఉత్తీర్ణత. (IIT కొరకు జాయింట్ ఎంట్రన్స్ ఎక్సామ్ (JEE) తప్పనిసరిగా క్వాలిఫై అవ్వాల్సి ఉంటుంది. ఈ కోర్సు యొక్క డ్యూరేషన్ 4 సంవత్సరాలు ఉంటుంది.)
సంస్థలు/విశ్వవిద్యాలయాలు(Institutes/Universities):
ఇక్కడ భారతదేశంలో ఉన్న కొన్ని ముఖ్యమైన సంస్థలు(Institutes), విశ్వవిద్యాలయాలు(Universities) ల గురించి CBSE Manual లో తెలిపిన ప్రకారం వివరించడం జరిగింది. వివిధ రాష్ట్రాలలో ఉన్న విద్యాసంస్థలు, యూనివర్సిటీలలో కూడా పైన తెల్పిన కోర్సులు అందుబాటులో ఉండవచ్చు. విద్యార్ధులు తమ దగ్గరలో, అందుబాటులో ఉన్న విద్యాసంస్థలు, యూనివర్సిటీలలో మీరు ఎంపిక చేసుకున్న కోర్సులు ఉన్నాయో, లేవో తెలుసుకొని అడ్మిషన్ పొందగలరు.
- IITs
- ఆంధ్ర యూనివర్సిటీ కాలేజీ ఆఫ్ ఇంజనీరింగ్ – విశాఖపట్నం, ఆంధ్ర ప్రదేశ్, ఇండియా. (Andhra University College of Engineering – Visakhapatnam, Andhra Pradesh, India.)
- గవర్నమెంట్ కాలేజీ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ సిరామిక్ టెక్నాలజీ (కాలేజీ ఆఫ్ సిరామిక్ టెక్నాలజీ) – కలకత్తా, వెస్ట్ బెంగాల్, ఇండియా. (Government College of Engineering and Ceramic Technology (College of Ceramic Technology) – Kolkata, West Bengal, India.)
- రాజస్థాన్ టెక్నికల్ యూనివర్సిటీ – కోట, రాజస్థాన్, ఇండియా. (Rajasthan Technical University – Kota, Rajasthan, India.)