Astronomy & Astrophysics Course Details in Telugu

Share this article with your friends

ఇంటర్మీడియట్ పూర్తి చేసిన తర్వాత విద్యార్ధులు తమ కెరీర్ లో ఉన్నత చదువుల కోసం ఏ కోర్సును ఎంపిక చేసుకోవాలో తెలియక తర్జనభర్జన పడుతుంటారు. అటువంటి వారికోసం CBSE (Central Board of Secondary Education) చే గుర్తించబడిన 113 రకాల కోర్సులలో ఒక్కొక్క కోర్సు గురించి వివరించడం జరిగింది. దీని ద్వారా విద్యార్ధులు  ఏ రంగంలో ఎటువంటి కోర్సులు ఉన్నాయో తెలుసుకొని, తమకు నచ్చిన రంగంలో కోర్సును ఎంపిక చేసుకొని జీవితంలో ఉన్నత స్థాయిలో స్థిరపడవచ్చు.   అందులో బాగంగా CBSE చే గుర్తించబడిన 113 రకాల కోర్సులలో ఆస్ట్రోనమి అండ్ ఆస్ట్రోఫిజిక్స్ (Astronomy and Astrophysics) కోర్సు గురించి వివరణ.

ఆస్ట్రోనమి అండ్ ఆస్ట్రోఫిజిక్స్  (Astronomy and Astrophysics)

పరిచయం(Introduction):

ఖగోళ శాస్త్రం(Astronomy) అనేది భౌతిక శాస్త్రం, రసాయన శాస్త్రం మరియు గణిత సూత్రాలు/ నియమాల కలయిక. ఖగోళ భౌతిక శాస్త్రాన్ని దాని శాఖగా చెప్పవచ్చు. ఇది ఖగోళ వస్తువుల భౌతిక, రసాయన మరియు డైనమిక్ లక్షణాల యొక్క వివరణాత్మక అధ్యయనంతో వ్యవహరిస్తుంది. ఇది భూమి యొక్క వాతావరణంపై మరియు పైన ఉన్న ధృగ్విషయాలతో కూడా వ్యవహరిస్తుంది. కక్ష్యలు, గురత్వాకర్షణ శక్తులు, ఉపగ్రహాలు, ఉల్కలు, గెలాక్సీలు, తోకచుక్కలు, నక్షత్రాలు, గ్రహ వస్తువులు, గ్రహాలు, ఉపగ్రహాలు, మొదలైన వాటి గణనల అనుబంధ అధ్యయనం ఉంది.

Read Also..  MCA Course Details in Telugu

ఖగోళ భౌతిక శాస్త్రం (Astrophysics) లో, మేము భౌతిక మరియు రసాయన శాస్త్ర నియమాల సహాయంతో ఖగోళ వస్తువుల యొక్క లక్షణాలు/స్వభావాన్ని అన్వేషిస్తాము  మరియు నిర్ధారిస్తాము. విశ్వం యొక్క మూలం మరియు పరిమాణాన్ని అధ్యయనం చేసే కాస్మోలజి (Cosmology) రంగం కూడా ఉంది.

కోర్సుల వివరాలు:
  1. M.Sc./M.Phil PhD(ఫిజిక్స్) (M.Sc./M.Phil PhD(Physics))
  2. M.Sc. ఆస్ట్రోనమి (M.Sc. Astronomy)
  3. M.Sc. – ఆస్ట్రోఫిజిక్స్ (M.Sc. – Astrophysics)
  4. ఇంటిగ్రేటెడ్ M.Tech – Ph.D(Tech.) ప్రోగ్రామ్ ఇన్ ఆస్ట్రోనామికల్ ఇన్స్ట్రుమెంటేషన్ (అర్హతలు: B.Tech/BE డిగ్రీ ఇన్ ఎలక్ట్రికల్/ ఇన్స్ట్రుమెంటేషన్/ ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్స్/ కంప్యూటర్ సైన్స్/ మెకానికల్ ఇంజనీరింగ్ లేదా M.Sc డిగ్రీ ఇన్ ఫిజిక్స్/ ఎలక్ట్రానిక్ సైన్స్/ ఆస్ట్రోఫిజిక్స్/ అప్లైడ్ మ్యాథమేటిక్స్/ అప్లైడ్ ఫిజిక్స్ వారు కూడా అప్లై చేసుకోవడానికి ఎలిజిబల్ అవుతారు.)
  5. Ph.D ఆస్ట్రోఫిజిక్స్/ఆస్ట్రోనమి (Ph.D Astrophysics/Astronomy)
Read Also..  Chemical Engineering Course Details in Telugu
అర్హతలు(Eligibility):

ఫిజిక్స్, కెమిస్ట్రీ మరియు మ్యాథమెటిక్స్ సబ్జెక్ట్ లలో 10+2 ఉత్తీర్ణత సాధించాలి.

ఎంట్రన్స్ పరీక్షలు (PhD from IUCAA) :
  1. IUCAA-NCRA అడ్మిషన్ టెస్ట్ (INAT)    Link Details: http://inat.ncra.tifr.res.in/inat
  2. జాయింట్ ఎంట్రన్స్ స్క్రీనింగ్ టెస్ట్ (JEST)     Link Details: http://www.jest.org.in/
  3. CSIR-UGC NET for JRF (Physics)
సంస్థలు/విశ్వవిద్యాలయాలు(Institutes/Universities):

ఇక్కడ భారతదేశంలో ఉన్న కొన్ని ముఖ్యమైన సంస్థలు(Institutes), విశ్వవిద్యాలయాలు(Universities) ల గురించి CBSE Manual లో తెలిపిన ప్రకారం వివరించడం జరిగింది. వివిధ రాష్ట్రాలలో ఉన్న విద్యాసంస్థలు,యూనివర్సిటీలలో కూడా పైన తెల్పిన కోర్సులు అందుబాటులో ఉండవచ్చు. విద్యార్ధులు తమ దగ్గరలో, అందుబాటులో ఉన్న  విద్యాసంస్థలు, యూనివర్సిటీలలో మీరు ఎంపిక చేసుకున్న కోర్సులు ఉన్నాయో, లేవో తెలుసుకొని అడ్మిషన్ పొందగలరు.

  1. యూనివర్సిటీ ఆఫ్ ఢిల్లీ, ఢిల్లీ. (University of Delhi, Delhi)
  2. ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఆస్ట్రోఫిజిక్స్, బెంగళూరు. (Indian Institute of Astrophysics, Bengaluru)
  3. ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్, బెంగళూరు. (Indian Institute of Science, Bengaluru)
  4. రామన్ రిసెర్చ్ ఇన్స్టిట్యూట్, బెంగళూరు. (Raman Research Institute, Bengaluru)
  5. ఇంటర్-యూనివర్సిటీ సెంటర్ ఫర్ ఆస్ట్రోనమి అండ్ ఆస్ట్రోఫిజిక్స్ (IUCAA) – పూణే. (Inter-University Centre for Astronomy and Astrophysics (IUCAA), Pune)
  6. నేషనల్ సెంటర్ ఫర్ రేడియో ఆస్ట్రోనమి – టాటా ఫండమెంటల్ రిసెర్చ్ ఇన్స్టిట్యూట్ – పూణే. (National Centre or Radio Astronomy – TATA Fundamental Research Institute – Pune)
  7. ఆర్యభట్ట రిసెర్చ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ అబ్స్ర్వేషనల్ సైన్సెస్(ARIES), నైనిటాల్. (Aryabhatta Research Institute of Observational Sciences (ARIES), Nainital)
  8. హరీష్-చంద్ర రిసెర్చ్ ఇన్స్టిట్యూట్ (HRI), ఆలహాబాద్. (Harish-Chandra Research Institute (HRI), Allahabad)
  9. ఉస్మానియా యూనివర్సిటీ, హైదరాబాద్ (Osmania University, Hyderabad)
  10. మద్రాస్ యూనివర్సిటీ, చెన్నై. (Madras University, Chennai)
Read Also..  Civil Engineering Course Details in Telugu

Share this article with your friends