Nursing Course Details in Telugu

Share this article with your friends

B.Sc., Nursing Couse Details

B.Sc నర్సింగ్  కోర్సు అంటే ఏమిటి.??

కోర్సు యొక్క వ్యవధి..??

ఈ కోర్సులో ముఖ్యమైన అర్హతలు ఏమిటి..??

ఎంత ఫీజు ఉంటుంది..??

కోర్సు యొక్క సిలబస్ ఏమిటి..??

ఈ కోర్సు పూర్తి చేసిన వారికి ఉద్యోగ అవకాశాలు ఏలా ఉంటాయి..??

ఈ కోర్సు పూర్తి చేసిన తర్వాత ఈ కోర్సుకి సంబంధించిన జాబ్ లో జాయిన్ అయితే జీతం ఎంత ఉంటుంది.??

ఒకవేళ చదువును కొనసాగించాలంటే ఎటువంటి కోర్సులు అందుబాటులో ఉన్నాయి..??

ఉద్యోగ అవకాశాన్ని కల్పించే సంస్థలు గురించి మరింత సమాచారం మీకోసం..

B.Sc నర్సింగ్  కోర్సు అంటే ఏమిటి.??

బ్యాచిలర్ సైన్స్ ఆఫ్ నర్సింగ్ (B.Sc., Nursing) అనేది మనకి తెలిసిన దాని ప్రకారం మెడికల్ సైన్స్ (నర్సింగ్) లో  4  సంవత్సరాల అండర్-గ్రాడ్యుయేట్ డిగ్రీ కోర్సు.

ఈ నర్సింగ్  కోర్సు భారతదేశంలో ఇండియన్ నర్సింగ్ కౌన్సిల్ (Indian Nursing Council) లో రిజిస్టర్ చేయబడి మరియు దాని  నియంత్రణలో పనిచేస్తుంది.

అర్హత (Eligibility):

ఒకవేళ విద్యార్ధులు B.Sc., Nursing కోర్సు లో జాయిన్ అవ్వాలంటే ఈ క్రింది అర్హతలు ఉండాలి.

  • విద్యార్థులు గుర్తింపు పొందిన యూనివర్సిటీ/బోర్డు నుండి 10+2 లేదా ఇంటర్మీడియట్  లో ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ సబ్జెక్టులలో  50% నుండి 55% మార్కులతో ఉత్తీర్ణత సాధించి ఉండాలి.
  • దేశవ్యాప్తంగా ఉన్న కొన్ని రకాల ప్రముఖ ఇన్స్టిట్యూట్ లలో విద్యార్థులు B.Sc., Nursing కోర్సు చేయాలనుకుంటే ఇన్స్టిట్యూట్ వారు నిర్వహించే ఎంట్రన్స్ ఎగ్జామ్ ను రాయాల్సి ఉంటుంది.
  • ఇంటర్మీడియట్ పూర్తి చేసిన తర్వాత ఈ B.Sc., Nursing కోర్సు లో జాయిన్ అవ్వవచ్చు.
Read Also..  MCA Course Details in Telugu
వయస్సు (Age) :

ఒకవేళ విద్యార్ధులు ఈ కోర్సు లో జాయిన్ అవ్వాలనుకుంటే ఈ  B.Sc., Nursing నోటిఫికేషన్ వెలువడే నాటికి విద్యార్ధుల యొక్క వయస్సు 17 సంవత్సరాల నుండి 35 సంవత్సరాల వరకు ఉండాలి.

కోర్సు యొక్క వ్యవధి..??

బ్యాచిలర్ సైన్స్ ఆఫ్ నర్సింగ్ (B.Sc., Nursing) కోర్సు యొక్క వ్యవధి 4 సంవత్సరాలు ఉంటుంది.

ఫీజు వివరాలు (Fee Structure):
  1. బ్యాచిలర్ సైన్స్ ఆఫ్ నర్సింగ్ (B.Sc., Nursing) కోర్సు చేయాలనుకునే విద్యార్ధులకు ఆయా కాలేజీలను (గవర్నమెంట్ & ప్రైవేట్) బట్టి కోర్సు యొక్క ఫీజు అనేది మారుతూ ఉంటుంది.
  2. ఆయా కాలేజీలను (గవర్నమెంట్ & ప్రైవేట్) బట్టి కోర్సు యొక్క ఫీజు మినిమమ్ 16వేల నుండి 2 లక్షల వరకు ఉంటుంది.
Entrance Exam Details (B.Sc., Nursing లో అడ్మిషన్ పొందుటకు):

B.Sc., Nursing కోర్సులో అడ్మిషన్ పొందాలంటే ముందుగా విద్యార్ధులు అడ్మిషన్ కి సంబంధించిన పూర్తి సమాచారం మరియు కోర్సుకి సంబంధించి ఆయా యూనివర్సిటిలు, కాలేజీలు నిర్వహించే ఎంట్రన్స్ ఎక్సామ్ ల గురించి తెల్సుకోవాల్సి ఉంటుంది.

దేశ వ్యాప్తంగా ఆయా యూనివర్సిటిలు, కాలేజీలు నిర్వహించే  ముఖ్యమైన కొన్ని రకాల ఎంట్రన్స్ ఎక్సామ్ ల వివరాలు:

  1. AIIMS – All India Institute of Medical Sciences- Nursing (ఆలిండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ – నర్సింగ్)
  2. AFMC – Armed Forces Medical College – Nursing (ఆర్మ్డ్ ఫోర్సెస్ మెడికల్ కాలేజీ – నర్సింగ్)
  3. SVNIRTAR – Swami Vivekananda National Institute of Rehabilitation Training and Research (స్వామి వివేకానంద నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ రిహాబిలిటేషన్ ట్రైనింగ్ అండ్ రిసెర్చ్)
  4. BHUUET – Banaras Hindu University Undergraduate Entrance Test (బనారస్ హిందూ యూనివర్సిటి అండర్ గ్రాడ్యూయేట్ ఎంట్రన్స్ టెస్ట్)
  5. CPNET – Combined Paramedical, Pharmacy and Nursing Entrance Test (కంబైన్డ్ పారామెడికల్, ఫార్మసీ అండ్ నర్సింగ్ ఎంట్రన్స్ టెస్ట్)
  6. JIPMER – Jawaharlal Institute of Postgraduate Medical Education & Research (జవహర్లాల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ పోస్ట్ గ్రాడ్యూయేట్ మెడికల్ ఎడ్యుకేషన్ & రిసెర్చ్)
  7. AUAT – Aliah University Admission Test (అలియ యూనివర్సిటి అడ్మిషన్ టెస్ట్)
Read Also..  Astronomy & Astrophysics Course Details in Telugu
Top Colleges :
  1. నిజాం ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (NIMS)-హైదరాబాద్.
  2. మెడిసిటి ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (MIMS)-ఘనపూర్.
  3. బాలాజీ ఇన్స్టిట్యూట్ ఆఫ్ నర్సింగ్-వరంగల్.
  4. మహారాజస్  ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (MIMS)-విజయనగరం.
  5. డా. ఎన్.టి.ఆర్ యూనివర్సిటి ఆఫ్ హెల్త్ సైన్సెస్-విజయవాడ.
  6. GITAM యూనివర్సిటి-విశాఖపట్నం.
  7. శ్రీ పద్మావతి మహిళా విశ్వ విద్యాలయం-తిరుపతి .
  8. ACSR గవర్నమెంట్ మెడికల్ కాలేజీ-నెల్లూర్.
B.Sc., Nursing యొక్క టాపిక్స్ :
  • Anatomy and Nutrition (శరీర నిర్మాణ శాస్త్రం మరియు పోషణ)
  • Medical Surgical Nursing (వైద్య శస్త్రచికిత్స మీద నర్సింగ్)
  • Child Care Nursing (పిల్లల సంరక్షణ మీద నర్సింగ్)
  • Community Health Nursing (సమాజం ఆరోగ్యం మీద నర్సింగ్)
  • Mental Health Nursing (మానసిక ఆరోగ్యం మీద నర్సింగ్)
  • Midwifery and Obstetrical Nursing Management of Nursing Services and Education (మంత్రసాని మరియు ప్రసూతి నర్సింగ్ నిర్వహణ మరియు నర్సింగ్ సేవలు)
  • Nursing Research and Statistics among many others (అనేక ఇతరముల గురించి నర్సింగ్ పరిశోధన మరియు గణాంకాలు)
Main Subjects (ముఖ్యమైన సబ్జెక్టులు):
  1. Anatomy (అనాటమీ)
  2. Physiology (సైకాలజీ)
  3. Nutrition (న్యూట్రిషన్)
  4. Genetics (జెనీటిక్స్)
  5. Microbiology (మైక్రో బయాలజీ)
  6. Midwifery (మిడ్వైపరి)
  7. English (ఇంగ్లీష్)
  8. Ethics (ఎథిక్స్)
కెరీర్ అవకాశాలు (B.Sc., Nursing కోర్సు తర్వాత):

B.Sc., Nursing కోర్సు పూర్తి అయిన తర్వాత ఒకవేళ ఉద్యోగం చేయాలనుకుంటే ఉద్యోగ అవకాశాలు ఈ క్రింది విధంగా ఉంటాయి.

  • Nurse (నర్స్)
  • Nursing Assistant (నర్సింగ్ అసిస్టెంట్)
  • Junior Psychiatric Nurse (జూనియర్ సైకీయాట్రిక్ నర్స్)
  • Home Care Nurses (హోమ్ కేర్ నర్సెస్)
  • Nurse-Nursery School (నర్స్- నర్సరీ స్కూల్)
  • Cruise Ship Nurse (క్రూయిజ్ షిప్ నర్స్)
  • Forensic Nurse ( ఫోరెన్సిక్ నర్స్)
  • Intensive Care Unit (ఇంటెన్సివ్ కేర్ యూనిట్)
  • Genetics Nurse (జెనెటిక్స్ నర్స్)
  • Flight Nurse (ఫ్లైట్ నర్స్)
  • Nursing Assistant Supervisor (నర్సింగ్ అసిస్టెంట్ సూపర్వైజర్)
  • Nursing Educator (నర్సింగ్ ఎడ్యూకేటర్)
  • Nurse & Patient Educator (నర్స్ & పేషెంట్ ఎడ్యూకేటర్)
  • Ward Nurse & Infection Control Nurse (వార్డ్ నర్స్ & ఇన్ఫెక్షన్ కంట్రోల్ నర్స్)
  • Nurse Manager etc.. (నర్స్ మేనేజర్ మొదలైనవి..)
Read Also..  Courses after Intermediate in Telugu
Salary (జీతం) (B.Sc., Nursing కోర్సు పూర్తి చేసిన తర్వాత ఉద్యోగం చేయాలనుకుంటే):

B.Sc.,Nursing కోర్సు పూర్తి చేసిన తర్వాత ఉద్యోగం చేయాలనుకుంటే వారి జీతం అనేది వారు ఉద్యోగం చేస్తున్న  గవర్నమెంట్ మరియు ప్రైవేట్ హాస్పిటల్ బట్టి, వారి యొక్క పోస్టుని బట్టి సంవత్సరానికి మినిమమ్ గా 2 లక్షల నుండి 7 లక్షల వరకు ఉంటుంది.

ఉద్యోగ అవకాశాలు కల్పించే కొన్ని రకాల సంస్థలు(హాస్పిటల్స్) (B.Sc., Nursing కోర్సు పూర్తి అయిన తర్వాత) :
  1. హాస్పిటల్స్ (Hospitals)
  2. నర్సింగ్ హోమ్స్ (Nursing Homes)
  3. ఇండస్ట్రియల్ హౌసెస్ (Industrial Houses)
  4. డిఫెన్సు సర్వీసెస్ (Defence Services)
  5. ఫోరెన్సిక్ డిపార్ట్మెంట్ (Forensic Department)
అవసరమైన నైపుణ్యాలు (Skills) :
  • బాగా మాట్లాడే స్వభావం
  • ఓపిక అవసరం.
  • బాధ్యత కలిగి ఉండాలి.
  • బాధగా ఉన్నప్పుడు వారిలో(పేషంట్ లలో) చైతన్యం తెచ్చే స్వభావం ఉండాలి.
Alternate Nursing Courses (ప్రత్యామ్నాయ నర్సింగ్ కోర్సులు):
  1. Certificate in Nursing Care Assistant (సర్టిఫికేట్ ఇన్ నర్సింగ్ కేర్ అసిస్టెంట్) – 6 to 12 Months
  2. Certificate in Home Based Healthcare (సర్టిఫికేట్ ఇన్ హోమ్ బేస్డ్ హెల్త్ కేర్) – 6 to 12 Months
  3. ANM (Auxiliary Nurse Midwifery) (ఆక్సీలియరి నర్స్ మిడ్వైఫరీ)  – 1 Year
  4. Diploma in Cardiovascular and Thoracic Nursing (CVT Nursing) (డిప్లొమా ఇన్ కార్డియోవాస్క్యులరీ అండ్ తోరాసిస్ నర్సింగ్)  – 1 Year
  5. Diploma in Nursing Administration (డిప్లొమా ఇన్ నర్సింగ్ అడ్మినిస్ట్రేషన్) – 1 Year
  6. Diploma in Surgical Nursing / Operations Room Nursing (డిప్లొమా ఇన్ సర్జికల్ నర్సింగ్ /ఆపరేషన్స్ రూమ్ నర్సింగ్) – 1 Year
  7. Diploma in Rural Healthcare (డిప్లొమా ఇన్ రూరల్ హెల్త్ కేర్) – 1.5 Years
  8. Diploma in Nursing Care Assistant (డిప్లొమా ఇన్ నర్సింగ్ కేర్ అసిస్టెంట్)  – 1.5 to 2 Years
  9. Diploma in Ayurvedic Nursing (డిప్లొమా ఇన్ ఆయుర్వేదిక్ నర్సింగ్) – 1.5 to 2 Years
  10. GNM (General Nursing & Midwifery) (జనరల్ నర్సింగ్ & మిడ్వైఫరీ) – 3.5 Years

Share this article with your friends